15.10.26

ముత్యపుపందిరి వాహనసేవలో జాతీయ కళారూపాల ఆధ్యాత్మిక వైభవం national folk-art







తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి నిర్వహించిన ముత్యపుపందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల్లోని 415 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపారు.


సంప్రదాయ కళారూపాలతో ఆధ్యాత్మిక సందడి


కేరళకు చెందిన మయూర నృత్యం, ఉరియాడ, మోహినీయాట్టం, ఒడిశా సంబల్‌పురి నృత్యం, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ నృత్యం, మణిపురి నృత్యం, పశ్చిమ బెంగాల్ రైబెన్సీ నృత్యం, మహారాష్ట్ర డ్రమ్స్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


తెలంగాణకు చెందిన ‘దేవీ వైభవం’ నృత్యరూపకం, ‘వేణుగాన విహారి’, తమిళనాడుకు చెందిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అస్సాంకు చెందిన బిహు నృత్యాలు భక్తులను అలరించాయి.


భక్తి.. సంప్రదాయం.. కళల సమ్మేళనం


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పాయి. శ్రీవారి వాహనసేవను దర్శించుకుంటూ, కళారూపాలను వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

No comments :
Write comments