1.10.26

అక్టోబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు thiruchanoor





•  అక్టోబర్ 02, 09, 23, 30 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.  


-అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు  


శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ...


-  అక్టోబర్ 02, 29 తేదీలలో రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం


శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో....


•  అక్టోబర్ 24న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు


శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో...


-  అక్టోబర్ 10న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నశ్రీ సూర్యనారాయణ స్వామి వారు


శ్రీనివాస స్వామి ఆలయం, తిరుచానూరు

•  అక్టోబర్ 03, 10, 17, 24, 31 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం


అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....


•  అక్టోబర్ 02, 09, 16, 23, 30 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.


•  అక్టోబర్ 06 ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.


•  అక్టోబర్ 06 నుండి 08వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు, అక్టోబర్ 05న శాస్త్రోక్తంగా అంకురార్పణ


•  అక్టోబర్ 14 ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.


•  అక్టోబర్ 20న ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం


•  అక్టోబర్ 04,11,18,25 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం

No comments :
Write comments