1.11.26

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం donation




ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.

ఈ మేరకు శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టిటిడిబోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తన సతీమణితో కలిసి కలిసి విరాళానికి సంబంధించిన డీడీని కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎ. ప్రశాంతి పాల్గొన్నారు.

No comments :
Write comments