8.11.26

నవంబర్ 8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత museum




తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం నిర్వహణ పనుల నిమిత్తం నవంబర్ 8, 9 తేదీల్లో ట్రయల్ రన్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.

తిరిగి నవంబర్ 10 నుండి 15వ తేదీ వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఇతర విద్యార్థులు, శ్రీవారి సేవకులకు ఉచితంగా మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరుగుతుంది.

కాగా, నవంబర్ 16వ తేదీ నుండి ఎస్వీ మ్యూజియంను సందర్శకుల కోసం ప్రారంభించనున్నారు. సందర్శకులకు ప్రవేశ రుసుము రూ.50గా నిర్ణయించడమైనది.

No comments :
Write comments