28.11.26

శ్రీవారి ఆలయ బూందీ పోటులో ఘనంగా ఆయుధపూజ ayudha puja





తిరుమలలోని శ్రీవారి ఆలయ బూందీ పోటులో శుక్రవారం ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ విచ్చేశారు.

ఈ సందర్భంగా శ్రీవారి చిత్ర పటానికి, ప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పోటు ఏఈవో శ్రీ ముని రత్నం, ఇతర అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు.

No comments :
Write comments