ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రథోత్సవఏర్పాట్లుసకాలంలోపూర్తిచేయాలి
అమ్మవారి ఆభరణాలు, వాహనాలు, బంగారు రథం శుభ్రపరిచే పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రథోత్సవానికి సంబంధించి రథం చెక్క పనులు, పెయింటింగ్, చక్రాల ఫిట్నెస్ తదితర పనులన్నింటినీ నవంబరు 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
డిసెంబరు 14నపంచమితీర్థం – పడిఊరేగింపునకుప్రత్యేకఏర్పాట్లు
పంచమి తీర్థం సందర్భంగా తిరుమల నుంచి ప్రారంభమయ్యే పడి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేఈఓ సూచించారు. ఈ ఊరేగింపులో సుమారు 60 కళాబృందాలు పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు విశేష ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని కలిగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పడి ఊరేగింపునకు సంబంధించి కోమలమ్మ సత్రం నుంచి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలిపిరి నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయం వరకు రహదారుల మరమ్మతులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో చేపట్టాలన్నారు.
ఊరేగింపు మార్గంలో మామిడి తోరణాలు, అరటి చెట్లు, పందిళ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించేందుకు మార్గమంతా అనౌన్స్మెంట్లు, బ్రాడ్కాస్టింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్వీబీసీద్వారాప్రత్యక్షప్రసారాలు
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవలు, ముఖ్య కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జేఈఓ సూచించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.
భక్తులకుమెరుగైనసౌకర్యాలుకల్పించాలి
కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఇంజినీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జేఈఓ సూచించారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మల్లికార్జున ప్రసాద్, వీజీవో శ్రీ గిరిధర, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, గోశాల డైరెక్టర్ డా. శివకుమార్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డా. కుసుమ కుమారి, అదనపు హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments