ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూతితో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, పర్యగ్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ అనంతరం గణపతి హోమం, లఘుపూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నవినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగి, కార్యసిద్ధి కలగాలని ఈ హోమం నిర్వహించడం విశేషం.
నవంబరు 12 నుంచిశ్రీసుబ్రహ్మణ్యస్వామివారిహోమం
విశేషపూజ హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 12, 13 తేదీలలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments