22.11.26

శాస్త్రీయ పద్ధతుల్లో ఆదర్శ ఎస్వీ గోశాల నిర్వహణ అభినందనీయం తిరుపతి ఎస్వీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ parliamentary committee



తిరుపతి ఎస్వీ గోశాలను కేంద్ర సహాయ మంత్రి గౌ.శ్రీ ఎస్.పి. సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ (పశుసంవర్ధక శాఖ) శనివారం సందర్శించింది.

ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం అనంతరం గౌ.సహాయ మంత్రి గోశాలను పరిశీలించారు. భారత ప్రభుత్వ రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM) పథకం కింద నిర్వహిస్తున్న ఈ గోశాలలో ఏర్పాటు చేసిన విశాలమైన, శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన షెడ్లు, పశువుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన దాణా సరఫరా, నిర్వహణ విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ గోశాలలో ప్రధానంగా స్వదేశీ సాహివాల్ జాతి ఆవులను పెంచుతున్నట్లు తెలిపారు. వీటి నుంచి లభించే స్వచ్ఛమైన పాలు,  పెరుగు తదితర పాడి ఉత్పత్తులను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అవసరాలకు వినియోగించడం విశేషమన్నారు. పూజలు, అభిషేకాలకు అవసరమైన పాడి ఉత్పత్తులను నాణ్యత, స్వచ్ఛతతో అందించేందుకు ఈ గోశాల ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

గతంలో తాము సందర్శించిన సాధారణ గోశాలలతో పోలిస్తే, ఈ ఎస్వీ గోశాల ఆధునిక సౌకర్యాలతో, శాస్త్రీయ పద్ధతుల్లో రూపుదిద్దుకోవడం అభినందనీయమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎస్ వి గోశాల దేశానికే ఆదర్శవంతమైన గోశాలగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవిఎన్ శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

No comments :
Write comments