13.11.26

కపిలతీర్థంలో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం subramanya swamy vari homam





తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు. శుక్రవారం కూడా హోమం కొనసాగనుంది.

గృహస్తులు రూ.500 చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments