29.11.26

నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo





తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో మెట్ల పూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరి వద్ద పూజ సామాగ్రి విక్రయాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడక మార్గంలో భక్తులు జారిపడకుండా నాణ్యమైన పసుపు, కుంకుమను మాత్రమే విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పారు. ఈ మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో టీటీడీ ఎస్ఈ-2 శ్రీ వేణు గోపాల్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, తిరుపతి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments