19.11.26

బాలల సంక్షేమం, భద్రతకు టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు ttd educational institutions




ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శ్రీ ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యుల బృందం బుధవారం తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలైన శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించింది.

ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలోని వంటశాల, స్టోర్‌ను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్‌లో పాటిస్తున్న పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.

అనంతరం ఇతర విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సమగ్ర సంక్షేమం కోసం టీటీడీ చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు శ్రీ గాంధీ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ వి. శివశంకర్, సంరక్షణ అధికారి శ్రీమతి జె. దేవయాని, టిటిడి ఏఈవో శ్రీమతి బి. అమ్ములు, హెడ్మాస్టర్ శ్రీమతి పద్మావతమ్మ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments