అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 05 నుండి 07వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అక్టోబర్ 04వ తేదీన అంకురార్పణ చేపట్టారు.
05వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం, 06వ తేదిన పవిత్ర సమర్పణ, 07వ తేదిన మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వీధి ఉత్సవం చేపడుతారు.
ఈ ఉత్సవాల సందర్భంగా పవిత్రోత్సవాల్లో పాల్గొన దలచిన భక్తులు ఒక టిక్కెట్టుకుగాను రూ.300/-లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టిక్కెట్టుకు ఇద్దరిని అనుమతిస్తారు.
సంక్షిప్త సమాచారంః-
పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్చించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాని పని. ఆజ్ఞానులమైన, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం, ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం అవుతుంది.
ఆగమోక్తంగా జరుపు నిత్య – వార – మాస – పక్ష – నక్షత్ర – సంవత్సరములందు జరుగు అర్చన, స్నపన, ఉత్సవ, విశేష పూజాదులలో తెలిసీ తెలియని దోషాలు సంభవిస్తే అది సంపూర్ణ ఫలితము నివ్వదు.
శ్రీపట్టాభిరామ స్వామి వారికి చేయు అర్చనాదోషములతో పాటు, అన్ని దోషములు నివారింపచేయునది, సర్వాభీష్టములను, అందించునది, యజ్ఞఫలమును ప్రసాదించునది, మన ఆత్మశరీరం ఇంద్రియములు వాక్కు, కర్మలను పవిత్రములుగా చేయునది పవిత్రోత్సవము.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పట్టాభిరామ స్వామివారికి ఈ పవిత్రోత్సవసేవ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవంలో అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూర్ణాహుతి అను వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Many devotees have requested to reconsider the existing system of allocation of Anga Pradakshina tickets in Lucy Dip and implement old system of allocating these tokens online, said TTD EO Sri AK Singhal.
In the media conference held at Annamayya Bhavan in Tirumala after the Dial your EO programme on Friday, the EO said, in the 20 days, since he assumed charge as TTD EO for the second time, wherever he inspects, many devotees along footpaths, Vaikuntham compartments, even in the Mada Streets during the recent annual brahmotsavams, have given feedback to resume the old system of allotting Anga Pradakshinam tickets on line instead of the existing system through lucky dip. He said, decisions of authorities changes from time to time. “Based on the feedback we receive from the pilgrims, we take decisions in the larger interests of the devotees. By the next board meeting, we will take a decision”, he maintained.
He also said, some devotees have also complained about the rude behaviour and rough handling of devotees inside the sanctum sanctorum during darshan by some employees, security and srivari sevaks. We have been imparting training to all of them. We improve our training in soft communication skills and behavioural attitude further. A pilgrim has also complained on the alleged involvement of an employee in a darshan scandal. Strict action will be initiated if anyone is found guilty in cheating pilgrims. The pilgrims also suggested having a relook to avoid congestion between Vendi Vakili and Bangaru Vakili. I have even noticed the congestion in the Entry-Exit points. Majority of devotees also wished to have a shelter along mada streets to protect from inclement weather conditions. We will explore the possibilities. All these issues will be dealt with soon, and you will see a change in a couple of months”, he told media.
Later he thanked the entire media, including print, electronic, social media for taking forward the grandeur of annual brahmotsavams in a jubilant way through their reports, projecting the facts to the world and playing a vital role in the success of the annual festival.
The devotees across the country poured in appreciation on TTD towards the successful conduct of annual brahmotsavams that concluded on Thursday and also congratulated TTD EO Sri Anil Kumar Singhal on his second time in the capacity.
The monthly Dial your EO was conducted at Annamayya Bhavan in Tirumala on Friday. In total, 23 pilgrim callers have given their feedback to the TTD EO on various issues including Darshan, accommodation, Srivari Seva, online booking, lucky dip system and other activities.
Before receiving the calls from the devotees, the EO also extended his heartfelt thanks to each and every one who congratulated him on assuming the charges as TTD EO for the second time. “Your credibility in me has enhanced my responsibility. I wholeheartedly thank Sri Venkateswara Swamy for this divine opportunity to serve you all in the capacity of EO for the second time in TTD and also the Honourable CM of AP Sri N Chandrababu Naidu for his trust in me”, he asserted.
Attributing the mega success of the recently concluded annual brahmotsavams in Tirumala to the teamwork of the entire workforce of TTD, co-operation of district administration and police, Srivari Sevaks, and above all the devotion of devotees, he thanked the TTD board, media and everyone involved behind the stupendous success.
The EO also stated that changes in TTD are a continuous process and decisions regarding darshan, accommodation, and other facilities, changes from time to time, depending on the situation. “Five years ago, when I was the then EO, the offline system of issuing tickets to Senior Citizens, Rs 300 SED were good for that time. But now, even for issuing 800 tickets of SRIVANI offline, we have been witnessing serpentine lines and over six hours of waiting time for the devotees. Once the quota is exhausted, many pilgrims are returning with empty hands without darshan. To avoid this inconvenience, we introduced an online system a few years ago. Our intention always stays good. Based on the feedback from devotees through mails, phone calls, whatsapp and other platforms, our decisions change from time to time. No system is static and there is every scope for change, keeping in view the larger interests of the devotees from time to time”, he reiterated.
CV & SO Sri Murali Krishna, CE Sri Satyanarayana and other officers were present.
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.
The unique festival, Bagh Savari was observed with spiritual fervour in Tirumala on Friday evening. This festival is observed the day after the annual Brahmotsavams, where the processional deities were taken to Ananthalwar Gardens.
According to legend, both Sri Venkateswara and His consort with an aim to test the devotion of Anantalwar, in disguise destroy the flower garden grown by him. Ananthalwar ties Goddess in disguise to an Aswatha tree, while Sri Venkateswara escapes, running anti-clockwise, and disappears inside Sanctum Sanctorum. Anantalwar realizes his mistake and unties the Goddess who was tied to the tree and carries her in a basket of flowers to reunite Her with Srivaru. Touched by his devotion, the Srivaru gives his ardent devotee a boon that he would visit Ananthalwar's Gardens every year after the annul brahmotsavams.
The same incident was replicated on Friday evening, which provided a visual treat to the devotees. All the temple officials, religious staff, devotees were present.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గౌ.ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి
వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టిటిడి అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు......
1. శ్రీ శ్రీనివాస్ - కడప
ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయండి.
ఈవో : పరిశీలిస్తాం
2. శ్రీ శంకరయ్య గౌడ్ - హైదరాబాద్
ప్రశ్న : నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చేసుకున్నాం. కానీ 14వ తేదీ రిపోర్టు చేయాలని ఉంది.
ఈవో : సాఫ్టు వేర్ లో మార్పులు చేసాం, నవంబర్ 13వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
3. శ్రీ మల్లేశ్వరరావు - పల్నాడు
ప్రశ్న : ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించండి.
ఈవో : ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు.
4 శ్రీ శ్రీనివాస్ - మెట్టపల్లి
ప్రశ్న: లడ్డు ప్రసాద సేవ తిరిగి ప్రవేశపెట్టండి.
ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డు ప్రసాద సేవ ఆపివేశం.
5. శ్రీ వీరబాబు - కాకినాడ
ప్రశ్న: అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి.
ఈవో: ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం.
6. శ్రీ నాగేశ్వరరావు - తిరుపూర్
ప్రశ్న : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులను మధ్య తోపులాట ఎక్కువగా ఉంది. అక్కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఈవో : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు. కావున ఒక్క నిమిషం పాటైనా స్వామి వారిని చూడాలనుకుంటారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం.
6. శ్రీ నాగేశ్వరరావు - తిరుపూర్
ప్రశ్న :రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడం వలన అన్నప్రసాదాలు వృధా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారు, అవగాహన కల్పించండి.
ఈవో : అన్నప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
8. కృష్ణ చైతన్య - ఖమ్మం
ప్రశ్న : లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి.
ఈవో : పరిశీలిస్తాం.
9. గీతా కుమారి - పశ్చిమగోదావరి
ప్రశ్న : సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పోలీస్ వారి కుటుంబ సభ్యులను అనుమతించారు, మాకు గేట్ తీయలేదు.
ఈవో : 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
10. శ్రీ హరికృష్ణ - ఖమ్మం మాధురి - హైదరాబాద్
ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి.
ఈవో : చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
11 అలేఖ్య హైదరాబాద్
ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు.
ఈవో : ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం.
12 అరుంధతి - హైదరాబాద్ సుబ్బలక్ష్మి - హైదరాబాద్
ప్రశ్న : వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి. ఆన్లైన్లో మూడు నెలలకు ముందు కాకుండా 15 రోజులకు ముందు విడుదల చేయండి.
ఈవో: పరిశీలిస్తాం.
13. హరి ప్రసాద్ తిరుపతి, ప్రశ్న : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు.
ఈవో : ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.