The annual Pavithrotsavam festival began with religious fervor and traditional grandeur at Sri Kodandarama Swamy Temple in Chandragiri on Sunday. As per Agama traditions, the Pavithrotsavam is performed every year to purify the temple premises and rectify any ritualistic lapses or omissions that might have occurred during various festivals and daily rituals throughout the year.
The rituals began with Suprabhata Seva, followed by Sahasranamarchana. From 9 a.m. to 11 a.m., Chatushtarchana and Pavitra Pratishtha were conducted. Later, the processional deities of Sri Sita, Rama, and Lakshmana Swamy were taken on a circumambulatory procession (Vimana Pradakshina) and placed in the Yagashala for further rituals. Vedic ceremonies and Pavitra Pratishtha were performed in the Yagashala. In the evening, from 6 p.m. to 8 p.m., Pavitra Homas were conducted with devotion.
Temple Superintendent Sri Gnanaprakash, Temple Inspector Sri Muni Haribabu, and a large number of devotees participated in the sacred event.
చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ముని హరిబాబు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
In connection with Nagula Chaviti on October 25, Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi takes ride on the seven-hooded Pedda Sesha Vahanam in Tirumala.
The procession on the serpent king takes places on evening along the four mada streets between 7pm and 9pm.
తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.
ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు.
అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.
Ankurarpana, the ceremonial commencement of the annual Pavithrotsavam rituals, was performed on Saturday evening at Sri Kodandarama Swamy Temple, Chandragiri in a traditional and devotional manner. As part of the programme, Senadhipati Utsavam, Mritsangrahanam, Raksha Bandhanam, and Medini Puja were conducted from 6 PM onwards.
Pavithrotsavam is performed to purify and rectify any ritual lapses that might have occurred knowingly or unknowingly during temple worship and festivals throughout the year, in accordance with Agama traditions.
The schedule of rituals is as follows:
October 12: Chatursthana Archana and Pavitra Pratishtha from 7 AM to 9 AM, followed by Pavitra Homam in the evening.
October 13: Vedic rituals in Yagashala from 7 AM to 9 AM, Pavitra Samarpana from 9 AM to 10 AM, and Pavitra Homam in the evening.
October 14: Maha Poornahuti, Kumbhabhishekam, Pavitra Visarjana, Snapana Tirumanjanam, Chakra Snanam, followed by Veedhi Utsavam at 6 PM.
Devotees (two persons as a couple) can participate in this Paid Seva by paying Rs. 200. Participants will receive Pavitra Mala and Teertha Prasadam as blessings.
Temple Inspector Sri Muni Haribabu and other officials participated in the programme.
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి.
అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.