14.10.25

Koil Alwar Tirumanjanam in Sri Govindaraja Swamy Vari Temple




The Koil Alwar Tirumanjanam will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati on October 16 in connection with Deepavali Asthanam on October 20.


The religious ritual will take place from 6:30am to 9:30am on Thursday. Later on devotees will be allowed for darshan.

అక్టోబరు 16న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం sri govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబరు 20న దీపావళి ఆస్థానం సందర్భంగా 

అక్టోబర్ 16వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా అక్టోబర్ 16న ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన, నివేదన, శాత్తుమొర జరుగనుంది, తదుపరి 6.30 గం.ల. నుండీ 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు (లేపనం) పూస్తారు. అనంతరం భక్తులను ఉదయం 09.30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

Pavitra Samarpana Held




As part of the ongoing annual Pavithrotsavams at the Sri Kodandarama Swamy Temple in Chandragiri, the sacred ritual of Pavitra Samarpana was performed with religious fervour on Monday.


The Pavitra Malas (sacred garlands) were ceremoniously offered to the deities and later Vedic rituals were conducted in the Yagashala.

Temple Superintendent Sri Gnanaprakash, Temple Inspector Sri Muni Haribabu, temple priests and others participated in the program.

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ chandragiri temple




చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు  స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ‌, కుంభారాధన, హోమం, ల‌ఘు పూర్ణాహుతి నిర్వహించారు.

ఉదయం 9 గంట‌ల నుండి యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్స‌వ‌ర్ల‌కు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శ్రీ ముని హ‌రిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation to ttd




తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని  టిటిడి అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో  అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి  విరాళం చెక్ ను అందజేశారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 10 lakh donation




బెంగుళూరుకు చెందిన శ్రీ ఎం.రాకేశ్ రెడ్డి అనే భక్తుడు సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీ అందజేశారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 10 lakh donation




గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సీఎఫ్ఓ శ్రీ సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,00,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ జంగా కృష్ణమూర్తి లు పాల్గొన్నారు.