ముందుగా ఈ మాలలను తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దనున్న శ్రీ పెద్దజీయర్ మఠానికి తీసుకువచ్చారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో మాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు.
రెండుకుటుంబాలనుంచిఆండాళ్, శిఖామణిమాలలు
ఆండాళ్ మాల, శిఖామణి మాలగా పిలువబడే ఈ రెండు విశిష్ట పుష్పమాలలను తిరుపతికి సుమారు 650 కిలోమీటర్ల దూరంలోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సంప్రదాయబద్ధంగా సమర్పిస్తున్నారు.
గోదాదేవిమాలలకువిశిష్టఆధ్యాత్మికప్రాశస్త్యం
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలను గరుడసేవ రోజున శ్రీవారికి అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పురాణ కథనాల ప్రకారం, శ్రీరంగమన్నార్ స్వామివారికి పుష్పకైంకర్యం చేసిన శ్రీ పెరియాళ్వార్ కుమార్తె గోదాదేవి, స్వామివారిపై అపారమైన భక్తితో పుష్పమాలను ముందుగా తాను ధరించి, అనంతరం స్వామివారికి సమర్పించేవారు. గోదాదేవి భక్తిని గుర్తించిన శ్రీరంగనాథుడు, ఆమె ధరించిన మాలలనే స్వీకరించారని భక్తుల విశ్వాసం. గోదాదేవిని శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా భావిస్తారు.
ఈ పవిత్ర సంప్రదాయం గరుడసేవకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చుతోంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
As part of the ongoing Srivari Salakatla Brahmotsavams, devotees will be permitted entry into the Swamy Pushkarini from 3 AM onwards following Garuda Seva on September 19.
Under normal circumstances, devotees are permitted to bathe in the Pushkarini daily from 6 AM onwards.
However, in view of the heavy influx of devotees expected on Garuda Seva day, TTD has decided to open the Pushkarini from 3 AM onwards.
ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 21 కళాబృందాల్లో 551 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో తిరుమాడ వీధులను కళా వైభవంతో నింపారు.
రాజస్థాన్ ఘూమర్, కర్ణాటక డొల్లు కుణిత, సుగ్గి కుణిత, మహారాష్ట్ర డ్రమ్ విన్యాసాలు, తెలంగాణ బతుకమ్మ, రాస్–గర్భా, ఉత్తరాఖండ్ సంప్రదాయ కళారూపాలు, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, చెక్కభజన, డప్పు నృత్యం, జాలరి నృత్యం, కోలాటం తదితర కళారూపాలు భక్తులను అలరించాయి.
వివిధ రాష్ట్రాల సంప్రదాయ కళల సమ్మేళనంతో తిరుమాడ వీధులు కళా వైభవాన్ని సంతరించుకోగా, కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళ దర్శనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
నాలుగుఉత్తమకళాబృందాలకుఈవోసన్మానం
వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువతో సన్మానించారు.
- ఎస్వీ సంగీత నృత్య కళాశాల – శ్రీ బాలాజీ బృందం, భరతనాట్యం, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ – 23 మంది.
- అన్నమాచార్య ప్రాజెక్టు – శ్రీ కెంచప్ప బృందం, సుగ్గి కుణిత, కర్ణాటక – 23 మంది.
- దాస సాహిత్య ప్రాజెక్టు – శ్రీ రాహుల్ ముఖర్జీ బృందం, ఒడిస్సీ, వారణాసి, ఉత్తరప్రదేశ్ – 27 మంది.
- హిందూ ధర్మ ప్రచార పరిషత్తు – శ్రీ కె. నాగరాజు బృందం, డొల్లు కుణిత, బెంగళూరు, కర్ణాటక – 30 మంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వివిధ రాష్ట్రాల కళాకారులు అందిస్తున్న ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి.