19.9.26

గరుడసేవకు విస్తృత ఏర్పాట్లు garuda seva arrangements



తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే రుడసేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు.


గరుడసేవ విధుల్లో పాల్గొనే టీటీడీ ఉద్యోగులు, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బంది, శ్రీవారి సేవకులతో శుక్రవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో ఆయన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకునేందుకు గరుడసేవకు తరలివచ్చే ప్రతి భక్తుడిని గౌరవిస్తూ, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది గరుడసేవ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు, టీటీడీ విభాగాలు పరస్పర సమన్వయంతో చైన్‌లింక్‌లా పనిచేసి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా భక్తులకు సేవలందించాలన్నారు.


టైం మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సమన్వయం, సేవాభావం ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తించాలని తెలిపారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యసేవలు తదితర సౌకర్యాలను సకాలంలో అందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


వాహనసేవ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగులు, శ్రీవారి సేవకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి, భక్తులు సురక్షితంగా వెళ్లే వరకు అవసరమైన సేవలు అందించాలని తెలిపారు. శ్రీవారి సేవకులు నిస్వార్థంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.


భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యం : జేఈవో డా. . శరత్


టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, శాఖల వారీగా అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా, విధేయతతో వ్యవహరిస్తూ సౌకర్యవంతమైన సేవలు అందించడమే పరమావధిగా ఉండాలని కోరారు.


భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు : సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ


టీటీడీ సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, గరుడసేవ రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అందుకు అనుగుణంగా సేవలను పటిష్టం చేయాలని సూచించారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు విభాగాలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.


ఈ సమావేశంలో అనంతపురం రేంజ్ ఐజీ సర్వశ్రీ శిమోషీ బాజ్‌పేయి, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

CULTURAL SPLENDOR AT SRIVARI BRAHMOTSAVAMS IN TIRUPATI



On Friday, during the Srivari Brahmotsavams, devotional, spiritual and cultural programs organized by TTD in Tirupati captivated devotees.

They were arranged by the TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project, Annamacharya Project and Sri Venkateswara College of Music and Dance.

Mahati Auditorium, Tirupati (6.30 pm to 8.30 pm): An instrumental ensemble by Sri M.P. Ramesh and troupe from Tirupati, and a Bharatanatyam performance by Smt. P. Malavika and troupe from Hyderabad, greatly impressed the devotees.

Annamacharya Kalamandiram (6.30 pm to 8.30 pm): Dr. Thatha Girija Seshamamba and troupe from Tirupati presented a devotional music concert.

Ramachandra Pushkarini (6 pm to 8 pm): A vocal concert by Smt. B. Chinnamadevi and troupe, and a Bharatanatyam performance by Sri C. Harika and troupe, both from Tirupati, greatly impressed the devotees.

తిరుపతిలో వెల్లివిరిసిన బ్రహ్మోత్సవాల సాంస్కృతిక శోభcultural programs




శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాయి.


మహతి ఆడిటోరియంలో సంగీత–నృత్య వైభవం

మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎం.పి. రమేష్ బృందం వాయిద్య సమ్మేళనం, హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి పి. మాళవిక బృందం భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించాయి.

అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంగీతం

అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ బృందం నిర్వహించిన భక్తి సంగీత కచేరి ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించింది.

రామచంద్ర పుష్కరిణిలో గాన–నృత్య ప్రదర్శనలు

రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి బి. చిన్నమదేవి బృందం గాత్ర కచేరి, శ్రీ సి. హారిక బృందం భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని పలు వేదికలపై సాగిన ఈ భక్తి, సంగీత, నృత్య కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Andal Sri Goda Devi Garlands Reaches Tirumala





The sacred garlands of Andal Sri Goda Devi  garlands from Srivilliputhur, Tamil Nadu, arrived Tirumala on Friday evening to be adorned to Sri Malayappa Swamy during the prestigious Garuda Seva which is set to take place on Saturday.


The garlands were first taken to Sri Peddajeeyar Mutt near Sri Bedi Anjaneya Swamy Temple, where special pujas were performed under the guidance of Sri Sri Sri Peddajeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala. 


They were then brought in a grand procession through the Mada streets to the Sri Venkateswara Temple amidst traditional nadaswaram and music.


Two Families Offer Andal and Sikhamani Garlands:


The Andal Garland and Sikhamani Garland are traditionally offered by two families of flower artisans from Srivilliputhur, about 650 km from Tirupati.


Spiritual Significance:


It is an age-old tradition to adorn the processional deity on Garuda Seva day with the garland first decorated to Goda Devi (Andal) in Srivilliputhur.


According to the legend, Goda Devi would first wear the garland out of devotion and then offer it to Sri Ranganatha, who accepted only those garlands she had worn. 


Goda Devi is regarded as an incarnation of Bhudevi, one of the consorts of Sri Venkateswara Swamy.


The event was attended by TTD EO Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple Deputy EO Sri Bhaskar, Srivilliputhur temple priests and other officials.


Rajasthan Ghoomar Dance Charms Devotees During Kalpavriksha Vahana Seva-01