27.9.26

ప్రత్యేక ప్రతిభావంతులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి : టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు ttd employees







 ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు కోరారు.


తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత అన్నప్రసాద భవనంలో శనివారం ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా శ్రీ ఆనందరాజు మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులకు సమాజంలో సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.


ఎస్వీ బధిరుల ఉన్నత పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగాధర్ మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్య, ఉద్యోగం, క్రీడలు, కళలు తదితర రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.


ఐదుగురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కారం


అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన ఐదుగురు ప్రత్యేక ప్రతిభావంతులైన టీటీడీ ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సంకేత భాష A–Z పోస్టర్లను ఆవిష్కరించారు.


అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం నుంచి సమావేశ మందిరం వరకు ప్రత్యేక ప్రతిభావంతులు ర్యాలీ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ మహేష్, టీటీడీ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ సునీల్ కుమార్, స్టేట్ అడ్వైజర్ శ్రీ లక్ష్మీనరసింహులు, టీటీడీలో విధులు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు devuni kadapa





దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు శ‌నివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


ఇందులో భాగంగా ఉద‌యం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు మహాపూర్ణాహుతి,  పవిత్ర వితరణ,  కుంభ ప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. అనంత‌రం సాయంత్రం 5 గంట‌లకు తిరువీధి ఉత్స‌వం జ‌ర‌గ‌నుంది. సాయంత్రం వీధి ఉత్స‌వం నిర్వ‌హించారు.


ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జ‌రిగాయి.


ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి,  టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు, విశేస సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Heavy Deman Drives Competition for ₹300 Darshan Tickets




The release of Rs.300 Special Entry Darshan tickets has led to intense competition, with lakhs of devotees attempting to book tickets simultaneously.


TTD clarified that its online booking system is functioning efficiently and is equipped with advanced technologies, including Google Cloud Platform, load balancing, auto scaling and distributed architecture.


During peak booking periods, around six lakh users may access the system at once.


Considering an average of four tickets per user, the potential demand may reach 24 lakh tickets, against an available quota of approximately 2.69 lakh tickets. 


As a result, tickets for popular slots may be exhausted within a very short time.


TTD explained that the Virtual Queue is used to regulate heavy traffic and protect the stability of the booking platform.


Messages such as “Slot Unavailable” generally indicate that the quota has been filled and should not automatically be viewed as a technical failure.


The payment process also involves external payment gateways, banks and UPI networks. 


Hence, payment failures may occur at different stages and require separate technical verification.


TTD also stated that continuous improvements are being made in booking capacity, database performance, security, anti-bot mechanisms and payment processing. 


It appealed to devotees not to believe false information circulated on social media and urged them to understand that unsuccessful booking attempts during peak demand do not necessarily indicate a system failure.

Pavitrotsavams Concludes at Devuni Kadapa Temple






The three-day Pavitrotsavams at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, concluded on Saturday with Maha Poornahuthi.


The final-day rituals included Maha Poornahuthi, Pavitra Vitarana and Kumbha Prokshanam, performed as per Agama traditions.


A Tiruveedhi Utsavam was also held in the evening. Devotional music, Harikatha and Bhajans were presented under the auspices of TTD’s Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.


Temple Deputy EO Smt. Prashanthi, AEO Sri Ravi, Temple Inspector Sri Eswar Reddy, priests and devotees participated.

టీటీడీ గోశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి go shala




టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి సూచించారు.


శనివారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ గోశాలలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా విచ్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వంతారా సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో గోశాలలు, జంతు సంరక్షణ కేంద్రాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు.


ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఆధునీకరించడంతో పాటు జంతువులకు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అదనపు ఈవో సూచించారు.


గోశాలల అభివృద్ధిలో భాగంగా గోడలకు టైల్స్ ఏర్పాటు, స్టీల్ నిర్మాణాలకు పెయింటింగ్, పక్షులు, ఇతర జంతువులు ప్రవేశించకుండా జీఐ మెష్ ఏర్పాటు, కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ గేట్ల ఏర్పాటు, గోడల మరమ్మతులు, పెయింటింగ్ తదితర పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వంతార సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు వివరించారు. 


పశువుల కదలికలకు అనుగుణంగా స్తంభాల మధ్య దూరం, తగినంత గాలి ప్రసరణ ఉండేలా వీటిని నిర్మించడంతో పాటు, మేత, నీటి వసతులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ, గోశాలల పరిసరాల్లో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.


స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులలను సాధ్యమైనంత వరకు తిరుమలలోనే ఉత్పత్తి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అదనపు ఈవో సూచించారు. స్వామివారి కైంకర్యాలకు అవసరమైన పాల ఉత్పత్తులను తిరుమలలోనే సమకూర్చుకోవడంతో పాటు, గో సంరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ గోశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.


ఈ సమావేశంలో టీటీడీ జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, ఎస్వీ గోశాల డైరెక్టర్ శ్రీ శివ కుమార్, ఎస్ఈ శ్రీ వేణు గోపాల్, ఈఈ శ్రీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ heavy demand




శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది.


టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను నిర్వహించేలా Google Cloud Platform (GCP), Load Balancing, Auto Scaling, Distributed Application Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అధిక డిమాండ్ సమయంలో వివిధ Application, API, Gateway తదితర సేవలను అనేక Replicas ద్వారా నిర్వహిస్తూ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.


టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక Technical War-Room ఏర్పాటు చేసి, Application Performance, Infrastructure Health, Transactions, Security తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.


కోటాతో పోలిస్తే దాదాపు 9 రెట్లు అధిక డిమాండ్


అధిక డిమాండ్ ఉన్న బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే.


అంటే అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే పూర్తవుతాయని వివరించింది.


వర్చువల్ క్యూ సాంకేతిక ట్రాఫిక్ నియంత్రణ విధానం


ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు Backend Systemsపై అధిక భారం పడకుండా, మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు Virtual Queue ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Virtual Queue భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు ఉద్దేశించినది కాదని, అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది.


అలాగే ‘Slot Unavailable’ వంటి సందేశాలు అధిక డిమాండ్ కారణంగా అందుబాటులో ఉన్న టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా రావచ్చని, దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని సాంకేతిక వైఫల్యంగా నిర్ధారించడం సరికాదని పేర్కొంది.


పేమెంట్ సమస్యలు వివిధ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి


ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ TTD అప్లికేషన్‌తో పాటు Payment Gateways, Banking Networks, UPI Networks వంటి బాహ్య వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని టీటీడీ తెలిపింది. అందువల్ల ఏదైనా Transaction విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది.


టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించరాదని టీటీడీ స్పష్టం చేసింది.


నిరంతరం సాంకేతిక అభివృద్ధి 


భక్తుల Feedbackను పరిగణనలోకి తీసుకుని Online Booking, Application మరియు Database Performance, High-Load Handling, Security, Anti-Bot Mechanisms, Payment Processes తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.


గతంలో నమోదైన Traffic Patterns, రాబోయే బుకింగ్‌లలో ఉండే అంచనా డిమాండ్ ఆధారంగా Capacity Planning, Infrastructure Scalingను కూడా సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.


శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తదితర ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నామని, అక్కడ భారీ స్థాయిలో ఒకేసారి ఏర్పడే డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపింది.


భారీ డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక ప్రయత్నంలో టికెట్ లభించకపోవడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం లేదా లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది.


భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికంగా సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ నిరంతరం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపింది. టీటీడీపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

26.9.26

పుదీనా, కొత్తిమీరతో అదిరిపోయే పనీర్ కర్రీ| Fresh Mint & Coriander Paneer Curry | Easy Homemade Recipe


పుదీనా, కొత్తిమీరతో అదిరిపోయే పనీర్ కర్రీ| Fresh Mint & Coriander Paneer Curry | Easy Homemade Recipe

https://youtu.be/9P_LehsiTbo