10.10.26

నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలి ttd addl eo





సెప్టెంబరులో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారుల సమన్వయంతో విజయవంతం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలని టిటిడి అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి కోరారు.


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు కేటాయించిన టిటిడి ఉద్యోగులకు శుక్రవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను చక్కటి సమన్వయంతో నిర్వహించామని, ఈ విజయం ఉద్యోగుల అందరిదని చెప్పారు.


జెఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది కలిసి టీమ్ వర్క్ గా పని చేయడం వల్ల గత బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత చాలా కీలకమైన అంశమని, కావున మాడవీధుల్లో కానీ‌, ఇతర ప్రాంతాల్లో కానీ భద్రతాధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా గేట్లను తెరిచి ఉంచడానికి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సహకరించాలన్నారు.


ఈ సమావేశంలో జెఈవో(విద్య, వైద్యం) శ్రీ గోపీనాథ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల గోశాలలో ఏర్పాట్ల పరిశీలన goshala


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి టీటీడీ చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని గోశాలను శుక్రవారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.


ఈ సందర్భంగా గోశాలలోని గోవుల సంరక్షణ, పశువుల ఆరోగ్య పరిస్థితులు, పాల ఉత్పత్తి సామర్థ్యం, పశుగ్రాసం నిల్వలు, ఇతర అవసరాలపై అధికారులతో సమీక్షించారు.


బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల గోశాలలో ప్రస్తుతం సుమారు 100 గోవులు ఉన్నాయని, రోజుకు దాదాపు 90 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. శ్రీవారి కైంకర్యాలకు గోశాల నుంచి సేకరించిన పాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.


అదేవిధంగా, ప్రతిరోజూ నిర్వహించే నవనీత సేవకు అవసరమైన సుమారు 1.5 కిలోల వెన్నను కూడా గోశాల నుంచే సమకూర్చుతున్నట్లు వివరించారు. నవనీత సేవకు సంబంధించిన ఊరేగింపు కూడా గోశాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు.


బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే ఏనుగులు, గుర్రాలు, ఎద్దుల సంరక్షణ, వాటి ఆరోగ్య పరిస్థితులు, ఉత్సవాల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, సన్నద్ధతను కూడా పరిశీలించారు.


జంతువుల సంరక్షణలో సిబ్బందికి ఉన్న అనుభవాన్ని, వాటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. జంతువులకు అవసరమైన వైద్య సదుపాయాలు, వెటర్నరీ నిపుణుల సేవలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోవులకు అవసరమైన పశుగ్రాసం, ఇతర వసతులను పటిష్ఠంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు.


తిరుమల గోశాలలో ప్రతి శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.


భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు – టిటిడి జేఈవో డా. ఎ. శరత్ ttd addl eo




తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో తిరుపతి నగరాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం టిటిడి జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపినాథ్‌తో కలిసి అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి సమీక్షించారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, మరుగుదొడ్లు, విద్యుత్ అలంకరణలు, అన్నప్రసాదాలు, ఫ్లెక్సీలు, సుందరీకరణ, భద్రత, పబ్లిక్ అడ్రస్ సిస్టం, సూచిక బోర్డులు తదితర 13 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


టిటిడి ఆలయాలు, భవనాలు, 17 సర్కిళ్లు.. 14 రోడ్లకు విద్యుత్ శోభ


తిరుపతిలోని టిటిడి ఆలయాలు, భవనాలతోపాటు 17 సర్కిళ్లు, 14 ప్రధాన రోడ్లు,  20 ఆర్చ్ లు, 8 పార్కింగ్ ప్రాంతాల్లో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలని జేఈవో సూచించారు.


ముఖ్యంగా గరుడ సర్కిల్, నంది సర్కిల్ తదితర కూడళ్లతో పాటు తిరుపతి నుంచి అలిపిరికి వెళ్లే రహదారులను విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనం, శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, లగేజ్ కౌంటర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.


ఎల్‌ఈడీ తోరణాలు.. పార్కింగ్‌లో ఫ్లడ్‌లైట్లు


ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తోరణాలు, ఆకర్షణీయమైన డిజైన్లు, ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ ప్రాంతాల్లో తగిన వెలుతురు కోసం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం, సూచిక బోర్డులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాన కూడళ్లలో బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.


భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, పార్కింగ్ ప్రాంతాల్లో తగిన సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జేఈవో స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, వీజీవో శ్రీ గిరిధర్, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డా. సునీల్ కుమార్, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

9.10.26

Ornaments Donated




A devotee from Hyderabad, Smt. Kamala, donated two gold coral necklaces (Bangaru Pagadala Haralu) worth approximately Rs. 25 lakh to Sri Venkateswara Swamy Tirumala on Thursday.


The donor, along with her family members, handed over the necklaces to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.