11.10.26

అక్టోబరు 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ brahmotsavams


శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 11వ తేదీ ఆదివారం అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.


సేనాధిపతి ఉత్సవం ….


శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.


మేదినిపూజ….


నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.


అంకురార్పణ….


వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.


అక్షతారోపణ…


ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.

కుప్పంలో అక్టోబరు 20న వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీపపూజ deepa pooja


కుప్పం విలజాపురం రోడ్డు, కుప్పం చెరువు కట్ట సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవ ప్రాంగణంలో అక్టోబరు 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీపపూజకు అన్ని ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా.ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన కుప్పంలో జరుగుతున్న ఏర్పాట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు.


భక్తులకు పటిష్ట సౌకర్యాలు


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ మహాలక్ష్మీ దీపపూజలో పాల్గొనే భక్తుల కోసం తగిన సంఖ్యలో షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం, వి.కోట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో దీపపూజలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 


భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి


దీపపూజకు తరలివచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జేఈవో సూచించారు. పోలీసు, మున్సిపల్‌, టీటీడీ సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.


శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దీపపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ శ్రీకాంత్‌, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారం, సీఈ శ్రీ మనోహరం, విజీఓ శ్రీ గిరిధర్‌, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డా. సునీల్‌, డీఈ (ఎలక్ట్రికల్‌) శ్రీమతి సరస్వతి, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ శ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

SRI MAHALAKSHMI DEEPA PUJA ON OCTOBER 20 AT KUPPAM


TTD JEO Dr. A. Sharath has directed officials to complete all arrangements for Sri Mahalakshmi Deepa Puja, scheduled at 4 PM on October 20 at the Deepotsavam venue near Kuppam tank bund, Vilajapuram Road, Kuppam.

Reviewing the arrangements through a Zoom meeting on Saturday, he instructed officials to provide sheds, mats, drinking water, LED screens, sanitation facilities, buttermilk and Annaprasadam for devotees.


He stressed the need for coordination among TTD, police and municipal departments to ensure proper security, parking and traffic management for the large number of devotees expected to attend the event.

Ornaments Donated




Smt. Aarti Bindal along with her husband from Jaipur donated Rs. 51.55 lakh worth jewels to Sri Venkateswara Swamy Tirumala on Saturday.


The ornaments include a gold pendant weighing 147 grams, studded with diamonds and precious stones, worth Rs. 44.35 lakh, and a three-strand pearl necklace weighing 27 grams, studded with diamonds and rubies, worth Rs. 7.20 lakh.


On this occasion, the donors handed over the ornaments to TTD Chairman Sri B.R. Naidu at the Ranganayakula Mandapam inside the Srivari Temple at Tirumala