The TTD Command Control Centre promptly traced and safely returned a lost bag containing
cash, gold and silver ornaments, a mobile phone, and other valuables to a devotee family from Telangana.
Acting on a complaint, vigilance officials reviewed CCTV footage, identified the taxi vehicle in which the bag was left behind, contacted the driver, and recovered the bag. The valuables, including ₹23,000 cash, gold and silver ornaments, an Oppo mobile phone, and a dental device worth about ₹1.20 lakh, were handed over to the owners after verification.
The devotees appreciated TTD's vigilance staff and advanced security monitoring system for their swift response and assistance.
TTD advised pilgrims to remain careful with their belongings while visiting Tirumala.
For this Super Centenarian woman, age is just a number before her determined devotion.
At 116, Smt Navaneethamma made a successful walk that too trekking the 3500 odd steps of Alipiri footpath route to reach, the abode of Universal Supremo Sri Venkateswara Swamy-Tirumala on Sunday evening.
As part of the annual Sri Sundararaja Swamy Avatara Mahotsavams at Tiruchanoor, the Lord blessed devotees on Hanumantha Vahanam during a grand procession through the four Mada Streets on Monday night.
Earlier, Abhishekam and Unjal Seva were performed with religious fervour.
The concluding Garuda Vahana Seva will be held on Tuesday night.
Temple Deputy EO Harindranath, AEO Devarajulu, priests, officials, and a large number of devotees participated.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించిన అనంతరం, హనుమంత వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.
మంగళవారంగరుడవాహనసేవ
అవతార మహోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Donations amounting to Rs.41 lakh were offered to various Trusts of the TTD on Monday.
Dr. Lion Sai Venkat of Hyderabad donated Rs.10 lakh on behalf of Swarna Vihar Infra Projects Private Limited to the Sri Venkateswara Sarva Shreyas Trust. He also contributed another Rs.10 lakh to the same Trust on the occasion of the release of the film "Jai Ho Ramanuja", scheduled for August 15.
Similarly, Smt. G. Lavanya of Guntur donated Rs 11,11,111 to the Sri Venkateswara Pranadana Trust.
Patamsetti Sai Phanindra of Rajamahendravaram (Rajahmundry) donated Rs.10 lakh to the Sri Venkateswara Annaprasadam Trust.
The donors handed over the donation DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.
The annual Salakatla Sakshatkara Vaibhavotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasamangapuram, will be celebrated from July 17 to 19 with religious fervour.
Special Snapana Tirumanjanam, Unjal Seva, and Vahana Sevas will be performed daily. The Lord will bless devotees on Pedda Sesha Vahanam (July 17), Hanumantha Vahanam (July 18), and Garuda Vahanam (July 19).
Koil Alwar Tirumanjanam will be observed on July 16, while Parveta Utsavam will be held on July 20.
TTD has cancelled Tiruppavada Seva on July 16 and Arjitha Kalyanotsavam from July 16 to 20 due to the festival. Devotional music programmes will also be organised throughout the celebrations.
The festival commemorates the historic revival of the temple and has been celebrated by TTD every year with great devotion.
ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరుగుతుంది.
మూడురోజులపాటుదివ్యవాహనసేవలు
మహోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూలై 16నకోయిల్ఆళ్వార్తిరుమంజనం
ఉత్సవాలకు ముందుగా జూలై 16న ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గర్భాలయం, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర తీర్థాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
జూలై 20నపార్వేటఉత్సవం
సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం మరియు ప్రత్యేక ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
కొన్నిఆర్జితసేవలురద్దు
ఉత్సవాల దృష్ట్యా జూలై 16న తిరుప్పావడ సేవ, అలాగే జూలై 16 నుండి 20వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
భక్తిసంగీతకార్యక్రమాలు
మహోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సాక్షాత్కారవైభవోత్సవాలచారిత్రకవిశిష్టత
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 14వ శతాబ్దం నుంచే విశిష్ట చారిత్రక ప్రాశస్త్యం ఉంది. విజయనగర రాజుల కాలం నుండి వేదపారాయణం, పూజా కైంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అనంతరం శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించి పూజలను పునఃప్రారంభించారు.
1940లో స్వామివారి దివ్య ఆదేశంతో ఆలయ పునరుద్ధరణ జరగగా, ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున తొలి పూజ నిర్వహించబడింది. అప్పటి నుండి ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం "సాక్షాత్కార వైభవం" పేరిట ఈ మహోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
బ్రహ్మోత్సవాలకు సమానమైన ప్రాధాన్యంతో జరిగే ఈ ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తున్నాయి.