24.7.26

Sri Soumyanatha Swamy Varu Blesses Devotees in Kurma Avataram





As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple, Nandalur, Lord Sri Soumyanatha Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees in Kurma Avataram on Tiruchi during the third day's procession on Friday morning.


The procession, accompanied by Govinda chanting, traditional bhajans, Kolatam and mangala vadyams, created a spiritually vibrant atmosphere. Devotees offered Karpura Harathi and received the Lord's blessings.


Temple AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Dileep, priests, officials and a large number of devotees participated in the event.

జూలై 24న తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ tallapaka temple




అన్నమాచార్యుల జన్మభూమి తాళ్లపాకలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 25 నుంచి ఆగస్టు 2 రకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందుగా జూలై 24 తేదీ సాయంత్రం 5 గంటలకు రెండు ఆలయాల్లో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో

జూలై 25న ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి శేషవాహన సేవ జరుగుతుంది.

ఉత్సవాల్లో భాగంగా...

జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంసవాహనం

జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం

జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం

జూలై 29 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ)

జూలై 30 – సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం

జూలై 31 – సాయంత్రం 6 గంటలకు రథోత్సవం

ఆగస్టు 1 – రాత్రి అశ్వవాహనం

ఆగస్టు 2 – ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో


జూలై 25న ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది.

ఉత్సవాల విశేషాలు...

జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం

జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం

జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం

జూలై 29 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నందివాహనం

జూలై 30 – సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం

జూలై 31 – సాయంత్రం పల్లకీ సేవ

ఆగస్టు 1 – సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం

ఆగస్టు 2 – వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం

ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.

ఆర్జిత కల్యాణోత్సవం

రెండు ఆలయాల్లోనూ జూలై 30న ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, అన్నప్రసాదం అందజేయనున్నారు.

ఆగస్టు 3 పుష్పయాగం

ఆగస్టు 3న ఉదయం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.

ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

23.7.26

Pallavotsavam Held in Tirumala






The traditional Pallavotsavam was observed in a religious manner in Tirumala on Wednesday. 

In connection with the birth anniversary celebrations of the Maharaja of Mysore, TTD observes the traditional  Pallavotsavam.

Following the Sahasra Deepalankara Seva, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi were taken in a procession to the Karnataka Choultry, where the representatives of the Mysore royal family offered traditional rituals to the deities.

Subsequently, officials from the Karnataka State Government and representatives of the Mysore royal family extended a formal welcome and performed a special Harathi to the deities. 

Special pujas were conducted, naivedyam was presented, and prasadam was distributed to devotees.

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary, Board Members Sri NareshKumar and Sri Darshan, Temple Peishkar Sri Ramakrishna, and other officials participated in the event.