17.8.26

Twin Garuda Seva in August




The devotees will have a Double Dhamaka this month where in they witness two Garuda Sevas.

Garuda Vahana Seva will be observed in view of Garuda Panchami in Tirumala on Monday, August 17. On this occasion, Sri Malayappa Swamy will take a celestial procession on His favourite Garuda Vahanam along the four Mada streets between 7 PM to 9 PM and bless the devotees.

SRAVANA POURNAMI  GARUDA SEVA ON AUGUST 28

TRIAL-RUN GARUDA SEVA ON THE SAME DAY

Sravana Pournami in Tirumala is observed on August 28. On this occasion, Sri Malayappa Swamy will bless devotees on His favourite Garuda Vahanam between 7 PM and 9 PM.

The annual Srivari Salakatla Brahmotsavams will be held from September 15 to 23. As per tradition, the Trial Run Garuda Seva is conducted every year ahead of the annual Brahmotsavams which will also be observed on the same day.

On this occasion, TTD senior officials will inspect the facilities that are to be provided to devotees and other engineering arrangements along the four Mada streets in view of annual Brahmotsavams next month.

ఈనెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ garuda vahanam




తిరుమ‌ల‌లో ఆగస్టు 17 తేదీ సోమ‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను నుగ్రహించ‌నున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి గ‌రు సేవ‌

తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌  గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు november 2026 quota




నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21 ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

24 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

16.8.26

టీటీడీకి రూ.1 కోటి విరాళం donation


హైదరాబాద్ కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సి.హెచ్..పి.రామేశ్వరరావు శ్రీ సాయిచందన ఏపిఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ డైరెక్టర్ శ్రీ ఉద్దగిరి తాతారావులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి రంగశ్రీ పాల్గొన్నారు