13.9.26

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవో apcm




తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఘనంగా ఆహ్వానించింది.

ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకిదేవి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు టీటీడీలో వ‌స్త్రాల ఈ - వేలం e-auction




తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ లయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను సెప్టెంబరు 21 నుండి 23వ‌ తేదీ వరకు - వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ సారీస్ 132 లాట్లు ఉన్నాయి

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలములు) 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.konugolu.ap.govt.in  / www.tirumala.org  సంప్రదించగలరు.

డిసెంబర్ నెల దర్శన మరియు వసతి కోటా విడుదల వివరాలు december quota




డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు విధంగా ఉన్నాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా  శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

సెప్టెంబరు 14న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు vinayakachawiti




తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో  సెప్టెంబరు 14 వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8  గంట‌లకు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

టీటీడీకి రూ.కోటి విరాళం donation




బెంగుళూరుకు చెందిన శ్రీ గిరియప్ప దయానంద అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.

12.9.26

నల్లేరు పచ్చడి | నల్లేరు కాడలతో రాతి పచ్చడి | Nalleru Leaf Chutney


నల్లేరు పచ్చడి | నల్లేరు కాడలతో రాతి పచ్చడి | Nalleru Leaf Chutney

https://youtu.be/kldRsdeOoHc

GRAND LAKSHA KUMKUMARCHANA HELD AT KAPILESWARA SWAMY TEMPLE



A grand Laksha Kumkumarchana was performed to Sri Kamakshi Ammavaru at the Sri Kapileswara Swamy Temple in Tirupati on the last Friday of the holy Sravana month.

As part of the ritual, Sri Mahalakshmi Ammavaru, Sri Saraswathi Ammavaru and Sri Kamakshi Ammavaru were consecrated at the temple mandapam. The rituals commenced with Kalasha Sthapana, Ganapathi Puja, Punyahavachanam and Kalasharadhana, followed by the Kumkumarchana.

Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, other officials, archakas and a large number of devotees participated in the programme.