21.9.26

“SITA KALYANAM” DANCE DRAMA ENCHANTS AUDIENCE



As part of the religious, spiritual and cultural programmes during Srivari Salakatla Brahmotsavams, a “Sita Kalyanam” dance drama was presented at Mahati Kalakshetra in Tirupati on Sunday.

The programme also featured a soulful vocal concert by Smt. Chinnamadevi and her team, with Annamacharya and Tyagaraja keerthanas including “Vade Venkataadri” and “Srinivasa Te Charanam.”

At Annamacharya Kalamandiram, vocal music by Kumari Srinidhi’s team from Hyderabad and a Kuchipudi performance by Sri Ratnakumar’s team from Singapore entertained the audience.

Devotional music and sankeertana programmes were also held at Sri Ramachandra Pushkarini.

A large number of devotees and local residents enjoyed the cultural programmes.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం clothes presented

 




తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర హుమానం అందించారు.


నెల్లూరు లోకసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.


ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నారని తెలిపారు. స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమన్నారు.


శ్రీవారి కృపాకటాక్షాలు వేమిరెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.

గజవాహన సేవలో దేశ, విదేశీ కళాకారుల కళా వైభవం gajavahana seva








తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం సాయంత్రం జరిగిన గజవాహన సేవలో దేశ, విదేశాలకు చెందిన కళాకారులు అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ రాష్ట్రాలు, ర్మనీ నుంచి వచ్చిన 19 కళాబృందాలకు చెందిన 528 మంది కళాకారులు గజవాహన సేవలో పాల్గొని తమ కళా ప్రదర్శనలతో తిరుమాడ వీధులకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.


ఈ ప్రదర్శనల్లో జర్మనీకి చెందిన కళాబృందం ప్రదర్శించిన లక్ష్మీనృసింహ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జర్మనీలో నివసిస్తున్న భారతీయులు ప్రదర్శించిన ఈ నృత్యం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలపై తమకున్న అభిమానం, భక్తి ప్రపత్తులను చాటారు. ఈ ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకించారు.


ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు జర్మనీ నుంచి కళాకారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటారు.


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు శ్రీనివాస కళ్యాణం, భరతనాట్యం, కోలాటం తదితర కళారూపాలను ప్రదర్శించగా, అస్సాం కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయ కళను ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కళాకారులు గాలో కళారూపంతో ఆకట్టుకున్నారు.


కర్ణాటకకు చెందిన కళాకారులు కథక్, శ్రీ వేంకటేశ్వర వైభవం, యక్షగానం, అర్ధనారీశ్వర పార్వతి శివ కళ్యాణం, జగన్నాథాయ జగన్నాటకం, మూర నృత్యం, కుణిత భజన, కోలాటం తదితర ప్రదర్శనలు ఇచ్చారు. మహారాష్ట్ర కళాకారులు డ్రమ్స్, లెజుమ్ ప్రదర్శనలతో ఉత్సాహాన్ని నింపారు. పాండిచ్చేరికి చెందిన కళాకారులు కరగట్టం ప్రదర్శించారు.


జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలతో తిరుమాడ వీధులు కళామయంగా మారాయి. కళాకారుల నృత్యాలు, వాయిద్య ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.


దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కళాకారులు పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించడం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని ఆధ్యాత్మికతతో పాటు భారతీయ సాంస్కృతిక వైభవం కూడా ప్రతిబింబించింది.


CULTURAL SPLENDOUR LIGHTS UP MADA STREETS DURING GAJA VAHANA SEVA






The sixth day of Tirumala’s annual Salakatla Brahmotsavams turned the Mada streets into a vibrant cultural corridor as 528 artists belonging to 19 troupes showcased their skills.


The states included  Andhra Pradesh, Assam, Arunachal Pradesh, Karnataka, Maharashtra, Puducherry, and Germany.


They presented unique folk and classical performances during the evening Gaja Vahana Seva.


A German troupe of Indian origin stole the show with their Lakshmi Narasimha dance, expressing deep devotion to Indian traditions. 


Other highlights included Srinivasa Kalyanam, Bharatanatyam, Kolatam from Andhra, Galo folk dance from Arunachal Pradesh, Yakshagana and Ardhanareeshwara Parvati Shiva Kalyanam from Karnataka; drums and Lezim from Maharashtra, and Karagattam from Puducherry.


The fusion of folk and classical arts transformed the temple streets into a living celebration of India’s cultural heritage, captivating devotees and art lovers alike.