23.9.26

ELABORATE ARRANGEMENTS FOR CHAKRASNANAM



TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary inspected Chakrasnanam arrangements at Srivari Pushkarini on Tuesday ahead of the September 23 event, the final day of Salakatla Brahmotsavam. 


He directed officials concerned to ensure orderly crowd movement, smooth entry and exit, and full coordination among TTD, vigilance and police teams.


Chakrasnanam will be performed between 6 am and 9 am on September 23.


He said devotees shall take a holy dip in a phased manner in the holy waters of Swamy Pushkarini throughout the day as the sanctity lasts the entire day through designated gates, maintaining discipline.


Crowd control will be managed in phases from galleries, with NDRF, fire, swimming teams and boats on standby. 


LED screens will be installed for easy viewing. 


A review meeting was also held with JEOs, CVSO, SP and other senior officers at Vaibhavotsava Mandapam.

చక్రస్నానానికి పటిష్ట ఏర్పాట్లు chakrasnanam






తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబరు 23 వైభవంగా నిర్వహించనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


క్రమపద్ధతిలో భక్తులకు ప్రవేశం


భక్తులు పుష్కరిణిలోకి సులభంగా ప్రవేశించి, తిరిగి బయటకు వెళ్లేలా నిర్దేశిత ప్రాంతాల్లో గేట్లు ఏర్పాటు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్‌, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.


ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం


సెప్టెంబరు 23న ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర ఘట్టాన్ని భక్తులు క్రమపద్ధతిలో వీక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.


పుష్కరిణిలో పవిత్ర స్నానానికి భక్తులకు అవకాశం


చక్రస్నానం రోజంతా పవిత్ర ఘడియలుగా భావించబడుతుందని, భక్తులు తమకు అనుకూలమైన సమయంలో పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని అదనపు ఈవో తెలిపారు. భక్తులు నిర్దేశించిన గేట్ల ద్వారానే ప్రవేశించి, సంయమనం పాటిస్తూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు.


రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు


పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోని భక్తులను దశలవారీగా పుష్కరిణిలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.


ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలు సిద్ధం


పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ విభాగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, ఈతగాళ్ల బృందాలను అందుబాటులో ఉంచి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పుష్కరిణిలో ఈతగాళ్లు, బోటును సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.


ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా చక్రస్నానం వీక్షణ


భక్తులు చక్రస్నాన మహోత్సవాన్ని సులభంగా వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అదనపు ఈవో సూచించారు.


అంతకుముందు వైభవోత్సవ మండపంలో చక్రస్నానం ఏర్పాట్లపై టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సమావేశంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీఈ శ్రీ మనోహర్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

SEVAKS LAUDED FOR EXEMPLARY SERVICES




The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary lauded the  Srivari Sevaks and Group Supervisors for rendering exemplary services during the ongoing Srivari Salakatla Brahmotsavams especially on the big day on Garuda Seva.


He held an interactive meeting with the Srivari Seva Group Supervisors at the Satsangam Hall in Seva Sadan–2, Tirumala, on Tuesday.


Speaking on the occasion, the Additional EO said that devotees had expressed their immense satisfaction and appreciation for the dedicated services rendered by the Srivari Sevaks. 


He particularly commended their efforts in distributing food, refreshments and drinking water to devotees gathered along the Mada Streets during Garuda Seva.


He also conveyed his gratitude to the Group Supervisors for effectively coordinating and monitoring the services of the Srivari Sevaks at every point.


The Additional EO called upon the volunteers to continue serving devotees with the same enthusiasm and dedication during the forthcoming Navaratri Brahmotsavams as well.


CVSO Sri Muralikrishna thanked the Srivari Sevaks for ensuring that devotees faced no inconvenience, during the Brahmotsavam festivities.


Later, the Srivari Seva Group Supervisors shared their feedback and field-level experiences while discharging their service duties at various locations.


TTD Chief Public Relations Officer, Head of the Srivari Seva Department Dr. T. Ravi, PRO (FAC) Kumari P. Neelima, staff of the Srivari Seva Department and nearly 150 Group Supervisors (including three NRI volunteers from Singapore(02) and African countries also participated in

Seva for the first time.

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు సేవలు అద్భుతం ttd addl eo




శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు అద్భుతమైన సేవలు అందించారని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కొనియాడారు.


తిరుమలలోని సేవా సదన్-2 లోని సత్సంగం హాలులో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లతో మంగళవారం ఉదయం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సేవల పట్ల భక్తులందరూ ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. గరుడసేవ సందర్భంగా మాడ వీధుల్లోని భక్తులకు అన్న పానీయాలు, తాగునీటి పంపిణీలో శ్రీవారి సేవకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. శ్రీవారి సేవకుల సేవలను పర్యవేక్షించిన గ్రూప్ సూపర్వైజర్లకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇదే ఉత్సాహంతో రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా తమ అత్యుత్తమ నిస్వార్ధ సేవలు అందించాలని కోరారు. 


సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి చిన్ని అసౌకర్యం కూడా కలగకుండా సేవలు అందించిన శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.


అనంతరం శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లు వివిధ ప్రాంతాల్లో తాము సేవా విధులు నిర్వహిస్తున్న సమయంలో తమ feedback ను అందించారు.


ఈ సమావేశంలో టీటీడీ సీపీఆర్వో, శ్రీవారి సేవా విభాగం అధిపతి డాక్టర్ టి.రవి, పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవా విభాగం సిబ్బంది, దాదాపు 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు(వీరిలో తొలిసారి సింగపూర్, ఆఫ్రికా దేశాలకు చెందిన NRI లు), తదితరులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవ వాహన సేవల్లో వెల్లివిరిసిన భారతీయ సాంస్కృతిక వైభవం CULTURAL PROGRAMES







తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహోత్సవంగా నిలిచాయి. ఎనిమిది రోజుల పాటు తిరుమాడ వీధుల్లో నిర్వహించిన వివిధ వాహన సేవల్లో దేశవిదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ కళా ప్రదర్శనలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.


ధ్వజారోహణం నుంచి అశ్వవాహనం వరకు శ్రీవారి వివిధ వాహన సేవల సందర్భంగా శాస్త్రీయ, జానపద కళారూపాలు కనువిందు చేశాయి. శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహినీ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ, అశ్వ వాహన సేవల్లో కళాబృందాల ప్రదర్శనలు భక్తుల్లో భక్తిభావాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని నింపాయి.


ప్రత్యేకంగా గరుడ వాహన సేవలో మణిపురి, మోహినీయట్టం, భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు డ్రమ్ముల విన్యాసాలు, గోండల్, కరకట్టం, ఘంటా తదితర జానపద కళారూపాలు అలరించాయి. హనుమద్వాహనం, గజ వాహన సేవల్లో వివిధ రాష్ట్రాల జానపద కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో ఆధ్యాత్మికతతో కళల సమన్వయం భక్తులను ఆకట్టుకుంది.


20 రాష్ట్రాలు.. 2 దేశాలు.. 7,871 మంది కళాకారులు


ఏడాది బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు జర్మనీ, సింగపూర్ దేశాల నుంచి కళాకారులు పాల్గొన్నారు.


మొత్తం 20 రాష్ట్రాలు, 2 దేశాల నుంచి 295 కళాబృందాలకు చెందిన 7,871 మంది కళాకారులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తమ ప్రాంతాల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొనడం ప్రత్యేక విశేషంగా నిలిచింది.


భారతీయ సంస్కృతికి ప్రతీకగా బ్రహ్మోత్సవాలు


వివిధ ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలకు చెందిన కళాకారులు ఒకే వేదికపై తమ కళలను ప్రదర్శించడం ద్వారాభిన్నత్వంలో ఏకత్వంఅనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పారు. శ్రీవారి వాహన సేవలకు సాంస్కృతిక ప్రదర్శనలు మరింత శోభను తీసుకొచ్చాయి.


తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పాల్గొన్న కళాబృందాలకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు.