18.10.26

జనవరి నెల దర్శన మరియు వసతి కోటా విడుదల వివరాలు january quota




తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా  శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Cultural Splendour Marks Hanumantha Vahana Seva








Artistes from different states enthralled devotees during the ongoing Srivari Navaratri Brahmotsavams

In Tirumala with their vibrant traditional dance performances in front of the Hanumantha Vahana Seva on Saturday morning.


A total of 516 artistes from 25 troupes performed classical dances, folk art forms, music and instrumental presentations along the Mada streets, adding devotional and cultural grandeur to the procession.


TTD Executive Officer Sri Muddada Ravichandra felicitated four outstanding troupes viz. Ramabhakta Hanumantha from Karnataka, Bharatanatyam from Tirupati, Maruni dance from Sikkim and Kommukoya folk art from Telangana on the occasion.


CULTURAL PROGRAMMES ADD SPLENDOUR TO GAJA VAHANA SEVA









Artistes from seven States, one Union Territory and two foreign countries presented vibrant cultural performances braving rains along the Mada streets during the Gaja Vahana Seva on the Saturday evening during the ongoing Srivari Navaratri Brahmotsavams at Tirumala.


In all, 16 troupes comprising 451 artistes enthralled devotees with classical, folk and devotional art forms. 


Bharatanatyam from Qatar and Kuchipudi from Dubai showcased the global reach of Indian classical traditions, while Karagattam from Puducherry added regional colour to the celebrations besides Lambadi dance from Andhra Pradesh, Lezim from Maharashtra, Kathak from Madhya Pradesh and Bhangra from Punjab that reflected the rich cultural diversity of India. 


A devotional dance ballet, Gajendra Moksham from Karnataka, aptly depicted the divine grace and complemented the spiritual significance of the Gaja Vahana Seva.


The performances were presented by four troupes each from the Hindu Dharma Prachara Parishad, Sri Venkateswara college of Music and Dance, Dasa Sahitya Project and Annamacharya Project of TTD  adding devotion, colour and grandeur to the sacred procession.

గజ వాహనసేవలో అద్భుత కళా వైభవం culatural events









తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన గజ వాహనసేవలో దేశవిదేశాల కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో భక్తులను పరవశింపజేశారు. శ్రీ మలయప్పస్వామివారి వైభవానికి కళా నీరాజనాలు అర్పిస్తూ తిరుమల మాడవీధులను భక్తిరసంతో, సాంస్కృతిక వైభవంతో పులకింపజేశారు.

విదేశాల్లోనూ వెల్లివిరిసిన భారతీయ కళా వైభవం

ఖతర్ కళాకారులు భరతనాట్యం, దుబాయ్ కళాకారులు కూచిపూడి ప్రదర్శనలతో భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను చాటగా, పుదుచ్చేరి కళాకారులు కరగట్టం నృత్యంతో ఆకట్టుకున్నారు.

వైవిధ్యభరిత జానపద కళారూపాలు

ఆంధ్రప్రదేశ్ కళాకారుల లంబాడీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల లెజిమ్స్, కర్ణాటక కళాకారుల గజేంద్ర మోక్షం నృత్యరూపకం, మధ్యప్రదేశ్ కళాకారుల కథక్, పంజాబ్ కళాకారుల భాంగ్రా ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి.

16 కళాబృందాల్లో 451 మంది కళాకారులు

ఈ సేవలో టీటీడీకి చెందిన నాలుగు ప్రాజెక్టుల నుంచి మొత్తం 16 కళాబృందాల్లో 451 మంది కళాకారులు పాల్గొన్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టు నుంచి 161 మంది, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల నుంచి 93 మంది, దాససాహిత్య ప్రాజెక్టు నుంచి 114 మంది, అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి 81 మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

భక్తి, సంప్రదాయం, జానపద కళల సమ్మేళనంగా గజ వాహనసేవ భారతీయ సంస్కృతీ వైభవాన్ని చాటుతూ భక్తులకు కనువిందు చేసింది.

హనుమంత వాహనసేవలో కళా వైభవం.. భక్తిభావంతో అలరించిన కళాకారులు hanumath vahaan seva















తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన హనుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 25 కళాబృందాల్లోని 516 మంది కళాకారులు పాల్గొన్నారు.


వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, గాన, వాద్య ప్రదర్శనలు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపాయి. కళాకారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.


నాలుగు కళాబృందాలకు ఈవో సన్మానం


హనుమంత వాహనసేవలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సన్మానించారు.


1. రామభక్త హనుమంత – కర్ణాటక: తారికెరెకు చెందిన దీప్తి హత్వార్ ఆధ్వర్యంలోని డీఎస్‌పీ కళాబృందం 28 మంది కళాకారులతో ప్రదర్శించిన ‘రామభక్త హనుమంత’ విశేషంగా ఆకట్టుకుంది.


2. భరతనాట్యం – తిరుపతి: జె. హరిప్రసాద్ ఆధ్వర్యంలోని ఎస్‌వీఎంసీడీ కళాబృందం 21 మంది కళాకారులతో ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది.


3. మరుణి నృత్యం – సిక్కిం: గ్యాంగ్‌టక్‌కు చెందిన జోయ్‌దేవ్ దేకా ఆధ్వర్యంలోని ఏఎన్‌పీ కళాబృందం 15 మంది కళాకారులతో ప్రదర్శించిన సంప్రదాయ మరుణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


4. కొమ్ముకోయ – తెలంగాణ: చింతూరు గ్రామానికి చెందిన టి. ఏడుకొండలు ఆధ్వర్యంలోని హెచ్‌డీపీపీ కళాబృందం 20 మంది కళాకారులతో ప్రదర్శించిన కొమ్ముకోయ జానపద కళారూపం భక్తులను ఆకట్టుకుంది.


భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, భక్తిభావాన్ని పెంపొందించేలా టీటీడీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. వివిధ రాష్ట్రాల కళారూపాల సమ్మేళనంతో హనుమంత వాహనసేవ మరింత వైభవోపేతంగా సాగింది.