Showing posts with label s. Show all posts
Showing posts with label s. Show all posts

1.6.25

జూన్1న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం




శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 1వ తేదిన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.

 
ఇందులో భాగంగా  ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేస్తారు.  
       
శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీనులు చేస్తారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ  భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేస్తారు.
   
అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు  ప్ర‌త్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభ‌వంగా నిర్వహించనున్నారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించనున్నారు.

7.5.25

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మే 11 నుండి 13వ తేదీ వరకు వసంతోత్సవాలు








తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.
ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 11 నుండి 13వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ జీ.రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, సుబ్బరాయుడు, ప్రసాద్, ఏవీఎస్వో శ్రీ జీ.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

25.3.20

RRR Movie Motion Poster Designs

NTR, Ramacharan acting Rajamouli Directing RRR Movie First Look Designs