15.7.25

తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువులలో మార్పు Tirumala Canteens




తిరుమలలోని 5 పెద్ద కాంటీన్లు, 5 జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ మరియు పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేయడం జరిగింది.


తాజా షెడ్యూలు ప్రకారం మారిన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి:

పెద్ద కాంటీన్లకు:

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుండి  26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చడం జరిగింది. 

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుండి  28-07-2025 ఉదయం 11 గంటలకు మార్చడం జరిగింది.

పత్రాల తెరిచే తేది : 

17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చడం జరిగింది.

జనతా కాంటీన్లకు :

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేయడం జరిగింది.

పత్రాల తెరిచే తేది: 

19-07-2025 నుండి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించి, దాని ప్రకారం తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

Revised EOI Schedule for Tirumala Canteens




Due to administrative reasons, the dates related to the issuance, submission, and opening of Expression of Interest (EOI) documents invited by TTD for the allocation of 5 Big Canteens and 5 Janata Canteens in Tirumala have been revised.


As per the revised schedule, the new dates are as follows:

For Big Canteens:

Last date for downloading documents: Extended from 15-07-2025 to 26-07-2025, 5 PM

Last date for submission of EOI documents: Extended from 17-07-2025 to 28-07-2025, 11 AM

Opening of EOI documents: Changed from 17-07-2025 to 28-07-2025, 12 Noon

For Janata Canteens:

Last date for downloading documents: Extended from 17-07-2025 to 28-07-2025, 5 PM

Last date for submission of EOI documents: Extended from 19-07-2025 to 30-07-2025, 11 AM

Opening of EOI documents: Changed from 19-07-2025 to 30-07-2025, 12 Noon

Interested participants in EoI are requested to take note of the revised dates and make necessary arrangements accordingly.

జూలై 15న శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాల్లో పుష్పయాగం Chenna Kesava Swamy Vari Temple




తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 15న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘ‌నంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు.

శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాల‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల‌ వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామి వారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Pushpa Yagama at Tallapaka Temples on 15th July




Pushpayagam will be held on July 15 at Sri Siddheswara Swamy and Sri Chennakesava Swamy temples in Tallapaka.


Morning rituals include Suprabhatam, Archana, and Snapana Tirumanjanam. 

In the evening from 6 PM to 8 PM, Pushpayagam will be performed with various flowers, followed by a temple procession.

This ritual is conducted as a purification ceremony after the annual Brahmotsavams to atone for any ritualistic lapses.

శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా పుష్పయాగం Nandaluru




అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జ‌రిగింది.


ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలిరేకులు వంటి 12 రకాల పూలు, తులసి, మ‌రువం. ధ‌వ‌నం వంటి 4 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

జూలై 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Grand Pushpa yagam Held at Sri Soumyanatha Swamy Vari Temple




A grand Pushpayagam was performed at Sri Soumyanatha Swamy Temple in Nandalur on Monday evening. 

The deities were worshipped with 12 types of flowers and 4 sacred leaves amidst Vedic chants and traditional music.

The ritual was held as a part of spiritual purification following the annual Brahmotsavams. 

Temple Superintendent Sri Hanumanthayya, Inspector Sri Dilip, archakas, and a large number of devotees took part in the event.

జూలై 16న టీటీడీ స్థానిక ఆల‌యాల్లో ఆణివార ఆస్థానం TTD Temples




తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయంలో జూలై 16వ తేదీ ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.


ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యం...

శ్రీ గోవింద‌రాజ‌ స్వామి వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పుండ‌రీక వ‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్ర‌ద‌క్ష‌ణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారికి స‌మ‌ర్పించనున్నారు.

శ్రీ కోదండరామాలయంలో....

శ్రీ కోదండరామాలయంలో బుధ‌వారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని గరుడాళ్వార్‌ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్ర‌ద‌క్ష‌ణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు స‌మ‌ర్పించనున్నారు.

 ఈ కార్యక్రమంలో తిరుమల జీయర్‌ స్వాములు, ఆలయ అధికారులు పాల్గొననున్నారు.