6.8.25

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు టీటీడీ ఆలయాల్లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం Tiruchanoor







ఆగస్టు 8వ తేది వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. 


భక్తులు అమ్మవారి దర్శనాన్ని సౌకర్యవంతంగా పొందేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 

ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సరఫరా, శోభాయమానంగా విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎస్‌వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు.

అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై  మాడ వీధులలో విహరిస్తారు. ఈ శోభాయాత్ర భక్తులను కనువిందు చేయనుంది.

టిటిడి ఆలయాల్లో సౌభాగ్యం: 

మహిళా భక్తులకు ‘సౌభాగ్యం’ కార్యక్రమం ద్వారా అమ్మవారి అనుగ్రహం అందేలా చర్యలు చేపట్టారు.

అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 51 టీటీడీ స్థానిక ఆలయాల్లో నిర్వహించే ‘సౌభాగ్యం’ కార్యక్రమం ద్వారా మహిళా భక్తులకు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ, కంకణాలు, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తకం, గాజులు వంటి పవిత్ర సామగ్రిని పంపిణీ చేయనున్నారు.

 టీటీడీ ఆలయాల్లో సదరు అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Varalakshmi Vratam for the First Time at Karvetinagaram




For the first time, the auspicious Sri Varalakshmi Vratham will be observed at the Sri Mahalakshmi Sannidhi in Sri Venugopalaswamy Temple, Karvetinagaram, on August 8 from 10 AM to 12 Noon.


Couples wishing to participate can register online or offline at the temple by paying Rs. 500. Participants will receive a traditional offering kit, including upper cloth, blouse piece, laddu, appam, kumkuma, prasadam, and a kit bag.

Teppotsavams from August 6 to 8

The annual Teppotsavams will be celebrated from August 6 to 8. On August 6, Sri Kodandaramaswamy along with Sita and Lakshmana will grace the float. On August 7 and 8, Sri Venugopalaswamy with Rukmini and Satyabhama will give darshan on the float from 6.30 PM to 8 PM.

Each day, Snapana Tirumanjanam will be performed from 9.30 AM to 10.30 AM, followed by a Tiruveedhi Utsavam from 5 PM to 6.30 PM.

Spiritual and devotional programs will be conducted under the aegis of the Hindu Dharma Prachara Parishad and Annamacharya Project during this festival.

కార్వేటి న‌గ‌రంలో తొలిసారిగా శ్రీ వ‌ర‌మ‌హాల‌క్ష్మీ వ్ర‌తం Varalakshmi vratam




కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కొలువైయున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో వరమహాలక్ష్మీ వ్రతాన్ని తొలిసారిగా ఈ ఏడాది ఆగ‌స్టు 8వ తేదిన ఉద‌యం 10 గంటల  నుండి 12 గంటల వరకు అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.


ఈ ప‌ర్వ‌దినాన శ్రీ వరమహాలక్ష్మీ  వ్రతంలో  పాల్గొనదలచిన భక్తులు (ఇద్దరికి) రూ.500 చెల్లించి ఆన్ లైన్‌ మరియు ఆఫ్ లైన్ లో ఆలయం వద్ద పొందవచ్చు. వ్ర‌తంలో పాల్గొన్న గృహ‌స్థుల‌కు ఉత్త‌రీయం, ర‌వికె, లడ్డు, అప్పం, బ్యాగ్, కుంకుమాది ప్రసాదములు బహుమానంగా అంద‌జేస్తారు.

ఆగ‌స్టు 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలు

కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా మొద‌టి రోజు ఆగ‌ష్టు 6న శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు, ఆగ‌ష్టు 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.  

ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Pavitrotsavams Commences






The annual Pavitrotsavams commenced on a grand religious note in Tirumala on Tuesday.


As a part of the three day fete, on the first day, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi.

In the Kalyanotsava Mandapam, the Utsava deities were offered celestial baths with sacred and aromatic ingredients amidst the chanting of vedic hymns by the Veda Pundits in a befitting manner.

On the initial day Pavita Pratista will be carried out by the priests as per Agama Vidhi.

Both the Tirumala Pontiffs, TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, temple chief priests, the Temple DyEO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna and other staff, devotees were also present.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం Pavitrotsavams









తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళ వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.


ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.

అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

      
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు,  డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కర్ శ్రీ రామకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.

5.8.25

Ankurarpanam Held






Ankurarpanam ritual in connection with the three-day annual Pavitrotsavams was observed in Tirumala on monday evening.


As a part of it, Vishwaksena commander in chief of Sri Venkateswara, was taken to Vasanta Mandapam and the rituals of Mritsangrahanam for Ankurarpanam was performed.

The TTD Additional EO Sri Ch.Venkaiah Chowdhary, other Temple officials and religious staff were present.

Meanwhile TTD has cancelled Sahasra Deepalankara Seva in connection with this fete.

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ANKURARPANAM

  










శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.


శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా సోమవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.