21.8.25

గదిలో మరిచిపోయిన వస్తువులు తిరిగి భక్తుడికి అప్పగింత forgotten belongings




తిరుమలలోని కృష్ణ స‌ద‌న్ విశ్రాంతి గృహంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన శ్రీ క‌ల్లూరి వెంక‌ట సుబ్బారావు అనే భ‌క్తుడు గురువారం గదిలో మరిచిపోయిన  ప‌ర్సు, రూ.1.10 లక్షలు విలువైన 12 గ్రాముల బంగారు బ్రాస్ లెట్, చేతి గ‌డియారాన్ని టీటీడీ సిబ్బంది తిరిగి అప్పగించారు.


ఈ సందర్భంగా కృష్ణ స‌ద‌న్ లో అటెండ‌ర్ గా ప‌ని చేస్తున్న శ్రీ మ‌హిధ‌ర్ రెడ్డికి స‌ద‌రు భ‌క్తుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీ విజయ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

20.8.25

Pavitrotsavams Commences at Amaravati in Sri Venkateswara Swamy Vari Temple





The Pavithrotsavam rituals commenced with religious fervour on Tuesday at Sri Venkateswara Swamy Temple, Venkatapalem, Amaravati.


As part of the programme, Panchagavya Aradhana, Akalmasha Homam, Vastu Puja, and Vastu Homam were performed in the Yagashala in the morning. 

Later, Snapana Tirumanjanam was conducted, during which the Utsava idols of the deities were ceremoniously offered special Abhishekam.

In the evening, Vaidika programmes, Pavitra Pratishtha, Adhivasa, and Sarvadaivatya Homam will be performed.

Superintendent Sri Mallikarjuna, Temple Inspectors Sri Ramakrishna and Sri Sandeep, temple priests, and a large number of devotees participated in the programme.

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం amaravati temple





అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స‌స్వామి ఆలయంలో మంగ‌ళ‌వారం పవిత్రోత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉదయం యాగ‌శాల‌లో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వ‌హించారు. అనంత‌రం స్నపన తిరుమంజనం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.  సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు.

ఆగష్టు 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణము, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఆగష్టు 21వ తేదీన ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమములు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపడుతారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ల్లికార్జున‌, టెంపుల్ ఇన్స్పెక్ట‌ర్లు శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ సందీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తిరుమలలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి నిల్వలు - అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ttd adl eo




తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో, తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి నిల్వలు  సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో  అదనపు ఈవో తిరుమల, తిరుపతి ప్రాంతాలలోని అన్ని డ్యాములలో నీటి లభ్యత, వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.


సమీక్షలో భాగంగా అదనపు ఈవో మాట్లాడుతూ, తిరుమలలోని డ్యాముల దృఢత్వంపై సమగ్ర నివేదిక అందించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.  ప్రస్తుత నీటి నిల్వలు 2025 డిసెంబర్ వరకు భక్తుల అవసరాలకు సరిపోతాయన్నారు. రాబోయే కార్తీక మాసంలో వర్షపాతం ఆధారంగా భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 

తిరుమలలో గోగర్భం, కుమారధార, పసుపుధార, పాపవినసనం, ఆకాశగంగ, తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ లలో ప్రస్తుతం భక్తుల అవసరాలకు తగిన నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి అవకాశాలను పరిశీలించాలన్నారు. గత 5  నుండి 10 సంవత్సరాల వరకు  నీటి లభ్యత, వర్షపాతం, వినియోగం, వృథా విడుదలపై నిపుణులచే సమగ్ర ఆడిట్ నిర్వహించాలన్నారు. నీటిని ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటే,  నిరంతర సరఫరా సాధ్యమని చెప్పారు. 

తిరుమలలోని వాణిజ్య సంస్థల నీటి బకాయిలను సకాలంలో వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ ఈ ఈ శ్రీ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ankurarpanam in Karvetinagara




As part of the annual Pavithrotsavams, Ankurarpanam was performed with religious fervour on Tuesday evening at Sri Venugopala Swamy temple in Karvetinagaram.


TTD officials and temple priests participated in the program.

శాస్త్రోక్తంగా శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌sri venugopala swamy vari temple




కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం సాయంత్రం పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ఉద‌యం సుప్ర‌భాతంతో స్వామి, అమ్మ‌వార్ల‌ను మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ది జ‌రిగింది. ఉద‌యం 10 గంట‌ల‌కు  ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం నిర్వ‌హించారు. సాయంత్రం  6 గంట‌ల నుండి మేదినీ పూజ‌, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, అంకురార్ప‌ణం నిర్వ‌హించారు.

ఆగస్టు 20వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగ‌శాల‌లో వైధిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగుస్తాయి.  

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Balalayam Samprokshanam Commences




The Balalayam Samprokshanam rituals commenced with traditional Agamic procedures at the Sri Lakshmi Venkateswara Swamy Temple in Devuni Kadapa, on Tuesday. 


The ceremonies will conclude with the Maha Samprokshanam on August 20.

Deputy E.O. Smt. Prashanthi, other temple officials and priests participated in the program.