TTD Trust Board Chairman Sri BR Naidu along with EO Sri Anil Kumar Singhal, accompanied by the Additional EO Sri Ch Venkaiah Chowdary and CVSO Sri Muralikrishna, inspected the four mada streets in Tirumala on Sunday evening.
Later briefing the media persons the Chairman said, as ensuing annual brahmotsavams are scheduled from September 24 to October 02, inspection is being carried out to oversee the ongoing arrangements for the mega religious fete.
He said this year elaborate illumination and flower decorations besides setting up over 30 plus LED screens to display live telecast of Vahana Sevas and other brahmotsavam related rituals will be done for the sake of pilgrims.
Earlier the Chairman and the top brass officials of TTD along with the heads of various departments inspected East, South, West and North mada streets to oversee the arrangements in galleries, Harati points, toilets and mobile toilets in various galleries that are arranged for the comfort of the devotees and many more.
Chief Engineer Sri Satyanarayana, EE Sri Subramanyam, VGOs Sri Ramkumar, Sri Surendra, DyEOs Sri Lokanatham, Sri Rajendra Kumar, Sri Somannarayana and other officers were also present.
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు.
టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
The Navaratri celebrations of Sri Kamakshi Ammavaru will be conducted with grandeur at Sri Kapileswara Swamy Temple, Tirupati, from September 22 to October 02. On each day, the deity will bless devotees in a distinct alankaram.
Necessary arrangements are being made in the temple premises for the smooth conduct of the festivities.
As part of the program, Koil Alwar Tirumanjanam will be performed on September 18 from 11:30 am to 2:30 p.m. The celebrations will commence on September 22, from 6 pm to 8pm with Ganapati Puja, Punyahavachanam, Ankurarpanam, Nava Kalasha Sthapanam, and Vastu Puja.
The schedule of daily alankarams is as follows:
September 23 – Sri Kamakshi Devi
September 24 – Sri Adi Parashakti
September 25 – Mavadi Seva Alankaram
September 26 – Sri Gayatri Alankaram
September 27 – Bala Tripura Sundari
September 28 – Sri Mahalakshmi Ammavaru
September 29 – Sri Annapurna Devi
September 30 – Sri Mahishasura Mardini
October 1 – Sri Saraswati Devi
October 2 – Sri Shivaparvati Alankaram
On the concluding day on October 02, Parveta Utsavam will be organized at 6 p.m. in the premises of Sri Abhayahasta Anjaneyaswamy Temple.
In connection with these festivities, devotional music concerts, pravachanams on Devi Bhagavatam, and recitations of Lalita Sahasranama will be conducted under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project.
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 18న ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవ కలశ స్థాపన, వాస్తుపూజ నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబరు 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్రిపుర సుందరి, సెప్టెంబరు 28న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, సెప్టెంబరు 29న శ్రీఅన్నపూర్ణాదేవి, సెప్టెంబరు 30న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Lok Sabha Speaker Sri Om Birla and Rajya Sabha Deputy Chairman Sri Harivansh Narayan Singh had darshan of Sri Venkateswara at Tirumala on Sunday.
On their arrival at the temple, TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary welcomed the dignitaries with traditional temple honors and facilitated their darshan.
They first offered prayers at the Dhwajasthambham before having darshan of the presiding deity. After the darshan, Vedic scholars rendered Veda Asheervachanam at Ranganayakula Mandapam. On this occasion, the TTD Chairman and Additional EO presented them with Teertha Prasadams and portraits of Sri Venkateswara.
AP Assembly Speaker Sri Ayyannapatrudu, Deputy Speaker Sri Raghurama Krishnamraju, Rajya Sabha MP Smt. Sudha Narayanamurthy also participated in the program.
Mandalabhishekam was performed in a traditional and devotional manner at Sri Venkateswara Swamy Temple in Vijayawada, on Sunday morning.
As part of the rituals, Vishwaksena Puja, Punyahavachanam, Agni Pratishtha, Shanti Homam, Ashtottarasata Kalashabhishekam and Purnahuti were conducted from 8:30 am onwards, marking the successful completion of Mandalabhishekam.
Later in the evening at 6pm, Shanti Kalyanam will be performed to Sri Venkateswara Swamy along with Sri Devi and Bhu Devi.
As per tradition, TTD organizes Ashta Bandhana Maha Samprokshanam once in every 12 years in its affiliated temples. In continuation of this practice, Maha Samprokshanam was conducted in July this year. Mandalabhishekam was performed 45 days after the Maha Samprokshanam.
TTD officials and temple priests took part in the religious program.
విజయవాడలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మండలాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమం, అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతితో మండలాభిషేకం ఘనంగా ముగిసింది.
సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.
సాధారణంగా టిటిడి అనుబంధ ఆలయాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్ట బంధన మహా సంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో మహా సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. మహా సంప్రోక్షణ తర్వాత 45 రోజులకు మండలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.