8.2.26

భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టిటిడి నూతన ఈవో ttd eo









టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రఆంధ్రప్రదేశ్ గౌరవ ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ తో కలిసి శనివారం మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు.


 సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఈవోఅనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచినాణ్యతపరిమాణంవడ్డన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారుఈవో వద్ద భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.


తదుపరి అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతోప్రత్యేకంగా శ్రీ‌వారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు.


అనంతరం తాగునీరుఆహార పరీక్షా ప్రయోగశాలను సందర్శించిన ఈవోవివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల రీక్షా ప్రక్రియను ఏవిధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయటి క్యూ లైన్లను పరిశీలించిన అనంతరం ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సందర్శించారుఅక్కడ రద్దీ నియంత్రణట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంట్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు సందర్భంగా అమెరికాలో ఉన్న దాత శ్రీ విజయప్రకాశ్ తో వర్చువల్‌గా మాట్లాడారు.


అనంతరం పీఏసీ-5ను సందర్శించిన వోలాకర్లుకల్యాణకట్టఅన్నప్రసాదంస్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించిభక్తుల సౌకర్యార్థం మరింత మర్థవంతంగా వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.


 కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్‌వో శ్రీ మురళీకృష్ణఇతర అధికారులు పాల్గొన్నారు.

138th Birth Anniversary of Sriman Veturi Prabhakara Sastry Celebrated






The 138th Birth Anniversary of Sriman Veturi Prabhakara Sastri was observed with grandeur at Annamacharya Kalamandiram in Tirupati, on Saturday.


Addressing the gathering, Dr. D. Prabhakara Krishnamurthy, Special Officer, TTD Puranetihasa Project, described Veturi Prabhakara Sastri as a scholar of exceptional intellect who followed the yogic path and made invaluable contributions to Telugu literature.


A literary seminar was held on the occasion. Retired Professor of the University of Hyderabad, Prof. Remalla Venkataramakrishna Sastri, highlighted the multifaceted works of Sri Sastri, while Dr. T. Rajashekhar of Sri Venkateswara University spoke on his role in bringing to light the literature of the Tallapaka poets, including Annamacharya compositions.


Earlier, floral tributes were offered to the life size bronze statue of Sriman Veturi Prabhakara Sastri. 


Floral tributes were also paid to his statue located at the TTD Oriental College premises by officials and faculty members. Annamacharya Project Director Dr Medasani Mohan was also present.

శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడు - డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి veturi prabhakara sastry






శ్రీమాన్  వేటూరి ప్రభాకర్ శాస్త్రి ప్రజ్ఞా ప్రభాకరుడనియోగ మార్గాన్ని నుసరించారని టిటిడిపురాణేతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి న్నారువేటురి వారికి యోగబలంసంకల్ప బలంమూలంగా ఇన్ని రచనలు చేయగలిగారనిఎన్నో పరిశోధనా  గ్రంథాలను పరిష్కరించారని ప్రశంసించారుశ్రీమాన్ వేటూరి ప్రభాకర్శాస్త్రి 138 జయంతి సందర్భంగా శనివారం ఉదయం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు.

 

అనంతరం బహుముఖ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులుఆచార్య రేమళ్ళ వేంకటరామకృష్ణ శాస్త్రి మాట్లాడారువేటూరి వారు శాసన పరిశోధకులుగాసాహిత్య పరిశోధకులుగాభాషావేత్తగాయోగి త్వమునిగాకవిగాపండితునిగా  బహుముఖ ప్రజ్ఞను చాటారని తెలియజేశారు.


అటు తర్వాతతాళ్ళపాక కవుల సాహిత్య ఉద్ధరణలో వేటూరి వారి కృషి అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్యపరిశోధనా సంస్థ ప్రతినిధి డాటిరాజశేఖర్ మాట్లాడారు.  వేటూరి వారి రస్పర్శ తగలనిదే అన్నమాచార్యుల సంకీర్తనలువెలుగులోకి రాలేదనితొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క కూడా వేటూరి వారి ద్వారానే వెలుగులోకి వచ్చారన్నారుతాళ్లపాకవాంగ్మయాన్ని సంపూర్ణంగా వెలుగులోకి తీసుకురావాలని సంకల్ప బలంతో పనిచేశారని కొనియాడారువేటూరి వారు టీటీడీకిఅందించిన సేవలుశ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసినపరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు.


ముందుగా అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి సాహితీసదస్సును ప్రారంభించారు.


అంతకుముందుశ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138 జయంతి సందర్బంగా శనివారం శ్వేత భవనం ఎదురుగాటీటీడీ ప్రాచ్యకళాశాలలో ఉన్ శ్రీ వేటూరి విగ్రహాలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ డామేడసాని మోహన్ఎస్వీ రియంటర్ కాలేజ్ప్రిన్సిపాల్ డా. సీతారామారావుఅన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాసిలత,  అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ ప త్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు jublee hills templs




హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు గోడ పత్రికలను మరియు ఆహ్వా పత్రికలను శనివారం జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.


 సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూజూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారుభక్తులను ఆకట్టుకునేలా విద్యుత్పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారుచలువ పందిళ్లుక్యూ లైన్లుతాగునీరుఅన్నప్రసాదాలుపటిష్ట సెక్యూరిటీ  ఏర్పాటు చేయాలని కోరారు.


 కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్..సి ప్రెసిడెంట్ శ్రీ విరెడ్డిఏఈవో శ్రీ రమేశ్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ హరికృష్ణపలువురు అధికారులుభక్తులు పాల్గొన్నారు.  


ఫిబ్రవరి 10 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


 సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపిఅనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం. నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారుఅనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 11 గం. నుండి సాయంత్రం 05.00 గం. వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.


ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


17-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం –  . 10.30 – 11.00 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


18-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


19-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


20-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


21-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు)


22-02-2026


ఉదయం – హనుమంత వాహనం


రాత్రి – గజ వాహనం


23-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


24-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


25-02-2026


ఉదయం – చక్రస్నానం(. 08.00 నుండి 10.00 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)


26.02.2026.


మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.


Maha Sivaratri Special Program




The TTD will organize “Mahashivaratri Spiritual Fest” on February 15 at various locations in Tirupati, including Mahathi Kalakshetram, Kapila Theertham, Annamacharya Kalamandiram, and Ramachandra Pushkarini.


The programmes will be held continuously from 6pm till midnight, featuring spiritual, cultural, and devotional events such as Shiva Stotra recitations, Puranic discourses, dance ballets, Harikathas, and bhajans, under the aegis of TTD Hindu Dharma Prachara Parishad and SV Music & Dance College.


The initiative aims to revive traditional Mahashivaratri night-long devotional practices and guide devotees along the spiritual path. 


Prasadam will be distributed to devotees after the Lingodbhava time. Devotees are requested to participate and seek the blessings of Lord Shiva.