14.3.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




హైదరాబాద్ కు చెందిన శ్రీమతి రాధిక శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు విరాళం డీడీని అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Sports Essential to Provide Better Services to Devotees - TTD Welfare Officer

 









TTD Welfare Department Deputy Executive Officer Sri Anandaraju stated that sports are essential for physical and mental development in today’s fast-paced modern lifestyle and also help employees provide better services to devotees. The closing ceremony of the TTD Employees’ Annual Sports Meet was held grandly on Friday evening at Mahati Kalakshetram in Tirupati.


Speaking on the occasion, he said that TTD employees discharge their duties under considerable pressure. Participating in sports helps reduce stress and maintain good physical health. He added that sports bring out hidden talents within individuals. He advised employees to make it a habit to engage in sports and exercise every day, noting that a strong sporting spirit among employees would keep them healthy and enable them to perform their duties more efficiently.


TTD Chief Public Relations Officer Dr. T. Ravi said that participation in sports enhances competitiveness and brings mental refreshment. He noted that sports increase mental enthusiasm and motivate employees to work with greater energy in the organization. He also emphasized that sports and music are essential for everyone to remain healthy.


He further mentioned that retired employees above 80 years of age also enthusiastically participate in the annual TTD sports events every year, setting an inspiring example for the employees.


Later, cultural competitions were conducted for the children of TTD employees and prizes were distributed to the winners.


Prizes were presented to the winners of various sports competitions by Welfare Officer Sri Anandaraju and Deputy EO Sri Govindarajan.


In these competitions, a total of 616 employees won first prizes, 533 secured second prizes and 106 received third prizes. Altogether, 2,400 employees and retired staff from various departments participated in the sports events, including 1,600 male employees and 800 female employees.


TTD CAO Sri Venkataramana, Chief Audit Officer Sri Venkateswara Rao, DE Sri Chandrasekhar, IT Assistant General Manager Sri Venkateswarlu Naidu and a large number of employees attended the programme.

భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు క్రీడలు అవసరం : టిటిడి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు sports day









ఉరుకులు పరుగులుగా సాగుతున్న నేటి ఆధునిక జీవన విధానంలో శారీరకమానసిక అభివృద్ధికి అలాగే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి క్రీడలు ఎంతో అవసరమని టిటిడి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ నందరాజు తెలిపారుటిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూటిటిడి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారుక్రీడల ద్వారా మనలోని కొత్త ప్రతిభా కోణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారుప్రతి రోజూ క్రీడలువ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలనిఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి పెరిగితే వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు విధులను మరింత సమర్థంగా నిర్వర్తించగలరని సూచించారు.


టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టిరవి మాట్లాడుతూక్రీడల్లో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారుక్రీడల వల్ల మానసిక ఉత్తేజం పెరిగి సంస్థలో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరణ లభిస్తుందని చెప్పారుప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలుసంగీతం ఎంతో అవసరమని తెలిపారు.


 ప్రతి ఏడాది నిర్వహించే టిటిడి వార్షిక క్రీడల్లో 80 సంవత్సరా పైబడిన విశ్రాంత ఉద్యోగులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లల కోసం సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సంక్షేమాధికారి శ్రీ ఆనందరాజుడిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.


 పోటీల్లో ఉద్యోగుల్లో మొత్తం 616 మంది ప్రథమ, 533 మంది ద్వితీయ, 106 మంది తృతీయ బహుమతులు అందుకున్నారువివిధ విభాగాలకు చెందిన మొత్తం 2,400 మంది ఉద్యోగులు రియు విశ్రాంత ఉద్యోగులు క్రీడాపోటీలలో పాల్గొన్నారువీరిలో 1,600 మంది పురుషులు, 800 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.


 కార్యక్రమంలో టిటిడి సిఏఓ శ్రీ వెంకటరమణచీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వరరావుడిఈ శ్రీ చంద్రశేఖర్ఐటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు తదితరులుపెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


Raising Provoking Slogans in the Darshan Queue Line is Wrong




On Thursday night, while in the queue line for Srivari Darshan, a devotee named Sri Anupoju Veera Naveen from Rajamahendravaram incited fellow devotees to raise slogans while waiting in the Narayanagiri sheds.


When the incident was brought to the attention of TTD, the said devotee was summoned. The devotee admitted that raising slogans and provoking others within the Darshan queue line was his mistake.


Consequently, the devotee tendered his apologies to TTD and to  the fellow devotees.


Meanwhile, TTD appeals to all its devotees to maintain restraint and patience while waiting for their turn for Srivari Darshan, and to cooperate with the staff.

దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం తప్పే- టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు




శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు.


 విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు.


ఇందుకుగాను టీటీడీ మరియు శ్రీవారి భక్తులకు  భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు.


కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


మార్చి 19న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం - మార్చి 16న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం sri govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయంలో మార్చి 19 ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది.


ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలకొలువుపంచాంగ శ్రవణంఅర్చన నిర్వహిస్తారుసాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు  పంచాంగ శ్రవణంఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది.


కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 16 తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుమార్చి 19 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


ఇందులో భాగంగా సోమ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహిస్తారుఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర న్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.