30.6.26

టీటీడీ ట్రస్టులకు రూ.1.10 కోట్ల విరాళం donation


హైదరాబాద్‌కు చెందిన లేవేన్ హోల్డింగ్స్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు రూ.1.10 కోట్లు విరాళాన్ని అందించింది.


సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ వెంకట రవికుమార్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళాల డీడీలను అందజేశారు.


ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు.


ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ  నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

No comments :
Write comments