ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అధికారిక శ్రీకారం చుట్టగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
బ్రహ్మోత్సవాలవిశేషాలు
జూన్ 25 – పెద్దశేష వాహనం
జూన్ 26 – చిన్నశేష వాహనం, హంస వాహనం
జూన్ 27 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
జూన్ 28 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
జూన్ 29 – మోహినీ అవతారం, శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం, గరుడ వాహనసేవ
జూన్ 30 – హనుమంత వాహనం, గజ వాహనం
జూలై 1 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
జూలై 2 – రథోత్సవం, అశ్వ వాహనం
జూలై 3 – చక్రస్నానం, ధ్వజావరోహణం
జూన్ 29న ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనుండగా, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహనసేవ జరగనుంది.
జూలై 3న పవిత్ర చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 4నపుష్పయాగం
బ్రహ్మోత్సవాల అనంతరం జూలై 4న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు
ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో శ్రీ బాలరాజు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మోహన్‌రెడ్డి, అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments