30.6.26

గరుడవాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యమంగళ విహారం garuda vahanam






అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవ అపూర్వ భక్తి వైభవాన్ని సంతరించుకుంది. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గరుడవాహనంపై దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు భయప్రదానమిచ్చారు.


రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన గరుడవాహన సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని "గోవింద... గోవింద..." నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పరమానందాన్ని పొందారు.


అంతకుముందు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ మండపానికి వేంచేపు, అనంతరం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు.


జూన్ 30 హనుమంత, గజవాహన సేవలు


బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 30, మంగళవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.


ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే శ్రీ గాలి భాను ప్రకాష్, టీటీడీ జేఈవో డా.  ఎ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ గిరిధర్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments