శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీదేవి ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ శ్రావణ శుద్ధ ద్వాదశి సందర్భంగా ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనభాగ్యం కల్పించనున్నారు.
గరుడవాహన సేవలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం ద్వారా భక్తులకు విశేష పుణ్యఫలాలు లభిస్తాయని ఆగమాలు పేర్కొంటున్నాయి.
అనంతరం ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు తులసి మహత్యం గురించి పురాణ పఠనం చేసి తులసీదేవి వైభవాన్ని భక్తులకు వివరిస్తారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.
ఈ దివ్య ఉత్సవంలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ భక్తులను ఆహ్వానిస్తోంది.
No comments :
Write comments