15.7.26

టీటీడీకి రూ.50 ల‌క్ష‌లు విరాళం donation




గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంట‌ర్ మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీడీ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10,00,116, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.10,00,116, బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. మేర‌కు సంస్థ అధినేత‌లు డాక్ట‌ర్ హ‌నుమ శ్రీ‌నివాస రెడ్డి, సిద్ధార్థ లు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీల‌ను అంద‌జేశారు.

అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీ శ్రీ‌ప‌తి శ్రీ‌నివాస్‌, కొటారు సునీల్ లు శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన శ్రీ చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. వీరి తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.

No comments :
Write comments