టీటీడీ
అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.60.61 లక్షలు విరాళంగా అందింది.ఈ మేరకు వైజాగ్ కు చెందిన ఎస్ఎస్ఎన్ఆర్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10.50 లక్షలు, శ్రీ విశ్వ సి.వి.చెరుకూరి అనే భక్తుడు రూ.10 లక్షలు, శ్రీ వంత ఇన్ ఫ్రా కాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, వెర్టెక్స్ కౌంటీ ఎల్ఎల్పీ సంస్థ రూ.10 లక్షలు, హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయిలీల ఎలక్ట్రికల్ ప్రోజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షలు, అమరావతిలోని తుళ్లూరుకు చెందిన శ్రీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రూ.10,11,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జాస్తి పూర్ణ సాంబశివరావు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments