తిరుపతిలోని
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు, శ్రీ చండికేశ్వరస్వామివార్ల పంచమూర్తులతో తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments