ఈ ఆడిషన్లు 2026 నవంబరు 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఆరు రోజులపాటు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించబడనున్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే https://apps.tirumala.org/dsp/ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలి.
అభ్యర్థుల అర్హతలు, ఆడిషన్ విధానం, సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, మార్గదర్శకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఆడిషన్ ప్రక్రియలో టీటీడీ ఎటువంటి ఏజెంట్లు, మధ్యవర్తులు లేదా ప్రతినిధులను నియమించలేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు అనధికార వ్యక్తులను నమ్మకుండా, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
No comments :
Write comments