రెండు ఆలయాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ధ్వజారోహణ మహోత్సవాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించి, బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
శ్రీచెన్నకేశవస్వామివారిఆలయంలోఉత్సవవిశేషాలు
ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి శేషవాహన సేవ భక్తులను అలరించనుంది.
ఉత్సవాల షెడ్యూల్:
జూలై 26: ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంసవాహనం
జూలై 27: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 28: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం
జూలై 29: ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ)
జూలై 30: సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం
జూలై 31: సాయంత్రం 6 గంటలకు రథోత్సవం
ఆగస్టు 1: రాత్రి అశ్వవాహనం
ఆగస్టు 2: ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం
ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
శ్రీసిద్ధేశ్వరస్వామివారిఆలయంలోఉత్సవవిశేషాలు
ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహించగా, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది.
ఉత్సవాల షెడ్యూల్:
జూలై 26: ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం
జూలై 27: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం
జూలై 28: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 29: ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నందివాహనం
జూలై 30: సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం
జూలై 31: సాయంత్రం పల్లకీ సేవ
ఆగస్టు 1: సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం
ఆగస్టు 2: వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం
ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
జూలై 30నఆర్జితకల్యాణోత్సవం
రెండు ఆలయాల్లోనూ జూలై 30న ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300 చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, అన్నప్రసాదం అందజేయనున్నారు.
ఆగస్టు 3నపుష్పయాగం
ఆగస్టు 3న ఉదయం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.
ఆధ్యాత్మిక–సాంస్కృతికకార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నారు.
No comments :
Write comments