4.7.26

జూలై నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు govindaraja swamy vari temple




తిరుప‌తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.


- జూలై 10, 31వ‌ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.


 - జూలై 12 రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.


-  జూలై 19 ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.


-  జూలై 17 ఆల‌యంలో ఆణివార ఆస్థానం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.


- జూలై 22 తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిలం మఠానికి వేంచేపు చేస్తారు.


- జూలై 24 నుండి 26 తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం.


- జూలై 26 తుల‌సీ మ‌హ‌త్యం ఉత్స‌వం సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.


- జూలై 29 పౌర్ణ‌మి సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజస్వామివారి గ‌రుడ సేవ‌.


No comments :
Write comments