తిరుపతిలోని
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments