26.7.26

హనుమంత వాహనంపై శ్రీ కోదండరాములవారి దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించిన శ్రీ సౌమ్యనాథస్వామి hanumath vahanam


నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీ కోదండరాములవారి దివ్య అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

శ్రీరామభక్త హనుమంతుని వాహనంపై విరాజిల్లిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. భక్తబృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నినాదాలు ఉత్సవానికి మరింత వైభవాన్ని చేకూర్చాయి.

ఆగమ శాస్త్రాల ప్రకారం హనుమంత వాహనంపై శ్రీ కోదండరాములవారి స్వరూపంలో దర్శనమిచ్చే శ్రీ సౌమ్యనాథస్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించిన వారికి భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

ఈ వాహనసేవలో ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments