29.7.26

నందలూరులో వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామివారి కల్యాణోత్సవం nandaluru


నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి మేత శ్రీ సౌమ్యనాథస్వామివారి దివ్య కల్యాణోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి మంగళవాయిద్యాల నడుమ వేద పండితులు వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్ఠాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ తదితర శాస్త్రోక్త క్రతువులను అత్యంత వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో దివ్య కల్యాణ మహోత్సవం ఘనంగా ముగిసింది.

స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు "గోవింద... గోవింద..." నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments