18.7.26

పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం pushpa pallaki






ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పల్లకీ ముందువైపు శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా, జయ విజయులు, మధ్యలో ద్వారక కృష్ణుడు, వెనుకవైపు శ్రీ ఆంజనేయస్వామివారి సెట్టింగులను ఏర్పాటు చేశారు. 

అదేవిధంగా రోజాలు, చామంతి, లిల్లి, మొలలు, మల్లి, కనకాంబరం, తామరపూలు, వృక్షి తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు, 5 రకాల కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు. 

అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్‌ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశారు. 

టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

No comments :
Write comments