28.7.26

ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo


ఎస్వీ మ్యూజియం భివృద్ధి పనులను శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోపు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఎస్వీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని గ్యాలరీలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మైబైల్ కౌంటర్లు, పాద రక్షకాలు భద్రపరచే కేంద్రాల ఏర్పాటు గురించి పలు సూచనలు చేశారు. 

ఈ పరిశీలనా కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఎస్ఈ శ్రీ వేణు గోపాల్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments