16.7.26

టీటీడీలో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యున్నత ప్రాధాన్యం ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ttd chairman











టీటీడీలో విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు "ప్రతిభా పురస్కారం–2026" కార్యక్రమాన్ని నంగా నిర్వహించి 147 మంది ప్రతిభావంతులను సన్మానించారు.

సందర్భంగా చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీలో విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థల్లో సుమారు 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, విలువలు, కృషిని అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, విద్యే జీవితాన్ని మార్చే శాశ్వత సంపద అని, దానిని ఎవరూ హరించలేరని పేర్కొన్నారు. గ్రామీణ, రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు టీటీడీ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా టీటీడీ విద్యాసంస్థలను తీర్చిదిద్దేందుకు అవసరమైన అధ్యాపక సిబ్బంది, మౌలిక సదుపాయాలు, పోషకాహార భోజనం, నాణ్యమైన బోధనను అందిస్తున్నామని తెలిపారు.

టీటీడీ జేఈవో డా. . శరత్ మాట్లాడుతూ, టీటీడీ 150 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా "ప్రతిభా పురస్కారాలు" అందజేయడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రూ.162 కోట్లతో విద్యాసంస్థలను ఆధునికీకరిస్తూ డిజిటల్ క్లాస్‌రూములు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సీసీటీవీ వ్యవస్థలు, ఆధునిక మౌలిక వసతులు ర్పాటు చేస్తున్నామని తెలిపారు. యోగా, సంగీతం, నృత్యం, నైతిక విలువల బోధనకు ప్రాధాన్యం ఇస్తూ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల సహకారంతో టీటీడీ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

టీటీడీ బోర్డు సభ్యురాలు శ్రీమతి పనబాక లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

బోర్డు సభ్యుడు శ్రీ జీ. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 250 అదనపు సీట్లు, డే స్కాలర్లకు మధ్యాహ్న భోజన పథకం, కొత్త విద్యా భవనాల నిర్మాణం ద్వారా మరింత మందికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.

బోర్డు సభ్యుడు శ్రీ ఎన్. సదాశివరావు మాట్లాడుతూ టీటీడీ విద్యాదాన ట్రస్ట్ ద్వారా రూ.162 కోట్లతో విద్యాసంస్థల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

సందర్భంగా ఎస్‌వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 76 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు, తిరుపతి, తిరుమలలోని వివిధ టీటీడీ పాఠశాలలకు చెందిన 71 మంది విద్యార్థులను సన్మానించారు. ఎస్‌పీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు చెందిన కుమారి ప్రణవి, కుమారి ఉత్పల, కుమారి నేహశ్రీ రాష్ట్రస్థాయిలో 99 శాతం మార్కులు సాధించినందుకు చైర్మన్, ఈవో ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు ఐదు గ్రాముల వెండి డాలర్, మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రం అందజేశారు.

అనంతరం విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ, క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఈవో శ్రీ డి. ఫణి కుమార్ నాయుడు వందన సమర్పణ చేశారు. కార్యక్రమానికి పీఆర్వో (ఎఫ్‌ఏసీ) కుమారి నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు

అనంతరం ప్రతిభ అవార్డులు తీసుకున్న విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో, తదుపరి వారితో ముచ్చటించారు

No comments :
Write comments