22.7.26

అలిపిరి చెక్‌పాయింట్‌లో మరిచిపోయిన బంగారం బ్యాగును భక్తుడికి అప్పగించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ttd vigilance


తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును తమ ఆధీనంలోకి తీసుకుని పరిశీలించగా, అందులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ బ్యాగు హైదరాబాద్‌కు చెందిన శ్రీ మహేష్ కు చెందినదిగా గుర్తించారు. అప్పటికే తాను బ్యాగును మరిచిపోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించి, పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా అప్పగించారు.

టీటీడీ యాజమాన్యానికి,  విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు శ్రీ మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. 

No comments :
Write comments